సాధారణంగా మనుషులు పక్షులకు కెమెరాలు పెడతారు.ఆకాశంలో చాలా ఎత్తులో ఎగిరే గద్దలు, డేగలకు కెమెరా అమర్చి విహంగ వీక్షణం ఎలా ఉంటుందో ఇప్పటికే కొందరు చూపించారు.
అయితే తాజాగా ఒక వ్యక్తి తన కుక్కకు( Dog ) కెమెరా ఇచ్చి వీడియో రికార్డు చేసేలా చేశాడు.ఆ కుక్క నోట్లో వీడియో కెమెరా పెట్టుకుని వీధంతా తిరిగింది.
ఆ సమయంలో చాలా అద్భుతమైన దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి.ముఖ్యంగా కుక్క ఫేస్, దాని ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ వీడియోలో కనిపించాయి.
అవి చూసేందుకు చాలా ముచ్చటగా అనిపించాయి.
కుక్క తన యజమాని తన వెనక పడుతూ ఉంటే అతడికి దొరకకుండా కెమెరా నోట కరుచుకుని ఉరుకుతూ ఉంది.అది ఆ సమయంలో అమాయకంగా, ముద్దుగా ఫేస్ పెట్టింది.ఈ కుక్క ఒక గోల్డెన్ రిట్రీవర్( Golden Retriever ) అని తెలుస్తోంది.
బ్రౌన్ కలర్ లో చాలా క్యూట్ గా కనిపించింది.
ప్రముఖ వైరల్ వీడియో షేరింగ్ పేజీ పూబిటీ (@Pubity) ఈ వీడియోను షేర్ చేసింది.“ఒక వ్యక్తి తన కుక్కకు కెమెరా ( Camera )ఇచ్చాడు.కుక్క తీసిన వాటిలో గ్రేటెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ వీడియో ఇదే” అన్నట్టు దీనికి ఒక క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.ఈ వీడియోని కుక్క చాలా స్టేబుల్ గా తీసిందని మరికొందరు అన్నారు.
స్టీవెన్ స్పీల్‌బర్గ్ లాగా ఇది డాగ్ స్పీల్‌బర్గ్ అని ఒక వ్యక్తి ఫన్నీగా కామెంట్ పెట్టాడు.దీనికి కోట్లలో వ్యూస్, 35 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.