సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ యానిమల్ ప్రీ రిలీజ్ ( Animal Pre Relese event ) ఈవెంట్ ని చాలా ఘనంగా చేశారు చిత్ర యూనిట్.రణబీర్ కపూర్( Ranbir kapoor ) , రష్మిక మందన్నా హీరో హీరోయిన్లు చేసిన ఈ సినిమాలో అనిల్ కపూర్,బాబి డియోల్ వంటి వాళ్ళు ముఖ్యపాత్రల్లో నటించారు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నవంబర్ 27న మల్లారెడ్డి యూనివర్సిటీలో చాలా అట్టహాసంగా నిర్వహించారు.ఇక ఈ ఈవెంట్ కి డైరెక్టర్ రాజమౌళి,మహేష్ బాబు, మంత్రి మల్లారెడ్డి వంటి వాళ్ళు వచ్చారు.
ఇక ఈ ఈవెంట్లో మల్లారెడ్డి బాలీవుడ్ పై చేసిన అలాగే మహేష్ బాబు పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి.
డిసెంబరు 1 న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న యానిమల్ మూవీ పై ఇప్పటికే అభిమానులు అంచనాలు పెంచుకున్నారు.ఈ సినిమా హిట్ అయితే గనుక చిన్న సినిమాలు వారం కూడా థియేటర్లలో ఆడవని చాలామంది అభిమానులు భావిస్తున్నారు.అయితే ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్ అన్నీ సినిమాపై మంచి హైప్ పెంచాయి.
దీంతో ఈ సినిమాపై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మహేష్ బాబు (Mahesh Babu) ధరించిన టీ షర్ట్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మహేష్ బాబు వేసుకున్న రౌండ్ నెక్ సింపుల్ టీషర్ట్ ధర ఎంతో తెలిస్తే మీరందరూ నోరెళ్ళబెట్టాల్సిందే.ఎందుకంటే ఆ సింపుల్ టీషర్ట్ ధర అక్షరాల 47 వేల రూపాయలని సమాచారం.అయితే ఈ సింపుల్ టీ షర్ట్ వేసుకొని అందరినీ ఆకట్టుకున్నారు మహేష్ బాబు.ఇక ఆయన వేసుకున్న టీ షర్టుపై అందరి కళ్లు పడడంతో ఆ టీ షర్ట్ ధర ఎంతో తెలుసుకోవడానికి నెటిజన్లు ఆరా తీశారు.
ఇక ఈ సింపుల్ టీ షర్ట్ ధర 47,000 అని తెలిసి మహేష్ బాబు ( Mahesh Babu ) ఏది వేసుకున్న ఓ బ్రాండే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.