ఉత్తరాఖండ్ టన్నెల్( Uttarakhand Tunnel ) లో 41 మంది కార్మికులను సురక్షితంగా రెస్క్యూ టీమ్ కాపాడటం జరిగింది.సొరంగంలో 17 రోజులపాటు చిక్కుకుపోయిన కార్మికులను కాపాడటానికి ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది.
ఈ క్రమంలో టన్నెల్ లో అమర్చిన పైప్ లైన్ ద్వారా రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వడం జరిగింది.ఈనెల 12వ తారీకున చిక్కుకున్న 41 మంది కార్మికులను.
పైప్ లైన్ ద్వారా ఒక్కొక్కరిని బయటకు తీసుకురావడం జరిగింది.బయటకు వచ్చిన వారిని వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో గ్రీన్ కారిడార్ ( Green Corridor )ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ఆపరేషన్ లో 41 మంది కార్మికుల సురక్షితంగా బయటపడటంతో ఏపీ సీఎం జగన్ స్పందించారు.
ఉత్తర కాశి టన్నెల్ ఆపరేషన్ లో రెస్క్యూ టీం చేసిన కృషి నిబద్దత అలుపెరగని ప్రయత్నాలు.విజయవంతం కావడం సంతోషించదగ్గ విషయం.ఈ రెస్క్యూ టీమ్ సభ్యులు అందరికీ నా శుభాకాంక్షలు.వారి సంకల్పం.ధైర్యం మనందరికీ స్ఫూర్తి.41 మంది కార్మికుల సురక్షితంగా ప్రాణాలతో బయటపడటం.నాకు ఎంతో ఉపశమనాన్ని కలిగించింది అని.సోషల్ మీడియాలో సీఎం జగన్ పోస్ట్ పెట్టారు.ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఆస్ట్రేలియాకు( Australia ) చెందిన నిపుణులు కీలక పాత్ర పోషించారు.సొరంగంలో 57 మీ.మేర వెర్టికల్‌గా డ్రిల్లింగ్ చేసి బాధితులను బయటకు తీసుకొచ్చారు.దాదాపు 17 రోజుల తర్వాత కార్మికులు సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు… బంధువులు హర్షం వ్యక్తం చేశారు.







