ఇటీవలే జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా( Australia ) చేతిలో ఓడిన భారత్ ప్రస్తుతం టీ20 సిరీస్ లో అదరగొడుతోంది.సొంత గడ్డపై జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత్ అద్భుతమైన ఆట ప్రదర్శనతో రెండు వరుస విజయాలను ఖాతాలో వేసుకొని అందరిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది.
నేడు గుహవాటి వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.నేడు జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ భారత్ ఖాతాలో పడుతుంది.

సూర్య కుమార్ యాదవ్( Suryakumar Yadav ) కెప్టెన్సీలో యువ ఆటగాళ్లంతా అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తున్నారు.ప్రపంచ కప్ ఆడిన ఆస్ట్రేలియా జట్టులో ఉండే సీనియర్ ఆటగాళ్లు కొందరు ఈ టీ20 సిరీస్ లో ఆడుతున్నారు.ఈ ఆటగాళ్లను భారత యువ ఆటగాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటూ మైదానంలో చెమటలు పట్టిస్తున్నారు.

ఈ టీ20 సిరీస్( T20 series ) లో భారత జట్టు ఆడే విధానం చూస్తే ఎంతో కసితో ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంటునట్లు అనిపిస్తోంది.మరొకవైపు ఆస్ట్రేలియా జట్టు నేడు జరిగే మ్యాచ్ ను సీరియస్ గా తీసుకుంది.ఎందుకంటే.
నేటి మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ అవకాశాలు ఆస్ట్రేలియా జట్టుకు అనుకూలంగా ఉంటాయి.ఒకవేళ ఓడితే భారత్ సిరీస్ గెలిచినట్టే.
భారత్ సిరీస్ కైవసం చేసుకోవాలని బరిలోకి దిగుతుంటే.ఆస్ట్రేలియా సిరీస్ అవకాశాలు సజీవం చేసుకోవడం కోసం బరిలోకి దిగుతోంది.
కాబట్టి నేడు జరిగే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది.భారత జట్టులో ఉండే ప్రతి ఆటగాడు అద్భుతంగా రాణిస్తూ ఉండడంతో జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది.







