బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో( Bigg Boss ) కంటెస్టెంట్లలో ఒకరైన శివాజీపై( Sivaji ) ప్రేక్షకుల్లో నెగిటివిటీ పెరుగుతోంది.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు శివాజీని టార్గెట్ చేస్తుండటం గమనార్హం.
బిగ్ బాస్ హౌస్ నుంచి తాజాగా ఎలిమినేట్ అయిన అశ్విని శ్రీ( Ashwini Sri ) అభిమానులతో ముచ్చటించారు.నీ వల్ల బిగ్ బాస్ ఫ్యాన్స్ కు ఉపయోగం ఏంటనే ప్రశ్నకు అశ్విని స్పందిస్తూ ఇలాంటి ప్రశ్నలు అడిగితే వెళ్లిపోతానని అన్నారు.
బిగ్ బాస్ హౌస్ కు అందరూ కప్పు గెలవడానికే వస్తారని ఆమె కామెంట్లు చేశారు.బిగ్ బాస్ హౌస్ లో నాకు ఎదురైన అనుభవాలు సరిగ్గా లేవని అశ్విని తెలిపారు.
అందుకే బిగ్ బాస్ ను చూద్దామని వచ్చానని చెప్పానని ఆమె కామెంట్లు చేశారు.వైల్డ్ కార్డ్ ఎంట్రీ( Wild Card Entry ) కావడంతో అప్పటికే హౌస్ లో ఉన్నవాళ్లు మమ్మల్ని కలుపుకోలేదని అశ్విని తెలిపారు.
మమ్మల్ని ఎప్పుడు బయటకు పంపించాలా అని వాళ్లు ఫీలయ్యేవారని ఆమె అన్నారు.

నాతో మాట్లాడేందుకు బిగ్ బాస్ లో ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో మానసిక వేదన అనుభవించానని అశ్విని తెలిపారు.నేను అందరితో స్నేహంగా ఉంటానని హౌస్ లో ఉన్న పరిస్థితుల వల్లే ఉమెన్ కార్డ్ వాడానని ఆమె కామెంట్లు చేశారు.ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన ఎమోషన్స్ ఉంటాయని అశ్విని( Ashwini ) కామెంట్లు చేశారు.
కష్టం వస్తే తప్ప ఊరికే ఏడవనని ఆమె కామెంట్లు చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో శివాజీ పాములాంటి వారు అని అందుకే హౌస్ లో పెద్ద పాము ఉందని అన్నానని అశ్విని కామెంట్లు చేశారు.నేను ఎవరినీ వెన్నుపోటు పొడవలేదని హౌస్ లో భోలే షావళితో( Bhole Shavali ) కనెక్ట్ అయ్యానని ఆమె అన్నారు.అతను నాకు మంచి ఫ్రెండ్ అని తొందరగా కలిసిపోయే గుణం ఉందని అశ్విని తెలిపారు.







