షాద్ నగర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడ్డారు.రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు రాకుండా కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు.
కాంగ్రెస్ ఫిర్యాదుతోనే ఎన్నికల సంఘం రైతుబంధును నిలిపివేసిందని కేసీఆర్ తెలిపారు.రైతులకు అన్ని విధాల కాంగ్రెస్ నష్టం చేస్తుందన్న ఆయన రైతుల నోటి దగ్గర బుక్కను లాక్కుంటుందని ఆరోపించారు.
అయితే కాంగ్రెస్ పార్టీలోని వారు కూడా రైతుబంధు తీసుకుంటున్న వారు ఉన్నారని పేర్కొన్నారు.రైతుబంధు ఆపేస్తే కాంగ్రెస్ పార్టీలోనే నేతలకు, కార్యకర్తలకు కూడా నష్టమేనని తెలిపారు.
ఈ క్రమంలో దీనిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలోచన చేయాలని వెల్లడించారు.







