తమిళ తెలుగు భాష చిత్రాలకు దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా నటుడిగా నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేసినటువంటి వారిలో నటుడు లారెన్స్ ( Lawrence )ఒకరు.ఇప్పటికీ ఈయన పలు సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా లారెన్స్ కేవలం నటుడు గానే కాకుండా ఈయన కొరియోగ్రాఫర్ అనే విషయం మనకు తెలిసిందే.లారెన్స్ మొట్టమొదటిసారి తన కెరియర్ ను కొరియోగ్రాఫర్ గానే ప్రారంభించారు.
అనంతరం దర్శకుడిగాను నటుడిగాను ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి లారెన్స్ తన ట్రస్టు ద్వారా ఎంతో మందికి సేవ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఎంతో మంది చిన్నారులను ఆదరించి వారికి మంచి భవిష్యత్తు అందించడమే కాకుండా ఎంతోమంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి కూడా ఉచితంగా ఆపరేషన్ చేయిస్తూ వారికి పునర్జన్మ కల్పిస్తున్నారు.అంతేకాకుండా ఎంతోమంది అనాధ చిన్నారులను చేరదీసి వారికి చదువు చెప్పించడంతో పాటు వారి బాగోగులు కూడా తీసుకున్నారు.ఇలా నిజజీవితంలో కూడా లారెన్స్ ఒక రియల్ హీరో అనిపించుకున్నారనే చెప్పాలి.ఇలా ఎంతోమంది చిన్నారులకు ప్రాణదానం చేస్తున్నటువంటి లారెన్స్ కూడా ఒకప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధితో బాధపడ్డారని తెలుస్తుంది.

ఈయన చిన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ( Brain Tumer ) అనే భయంకరమైన వ్యాధితో బాధపడ్డారట.ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం తన తల్లిదండ్రులు ఎన్నో చోట్ల చికిత్స చేసినప్పటికీ వ్యాధి మాత్రం నయం కాలేకపోయింది.ఆ సమయంలోనే లారెన్స్ తల్లి రాఘవేంద్ర స్వామిని కొలిచేదని రాఘవేంద్ర స్వామిని( Raghavendra Swamy ) కొలవడంతోనే తనకు ఆ సమస్య తగ్గిపోయిందని తెలుస్తుంది.రాఘవేంద్ర స్వామి ఆశీస్సుల వల్లే తాను భయంకరమైనటువంటి వ్యాధి నుంచి బయటపడటంతో లారెన్స్ తన పేరు పక్కన రాఘవ అనే పేరును చేర్చుకొని రాఘవ లారెన్స్ ( Raghava Lawrence ) గా మారిపోయారు.

ఈ విధంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి నుంచి బయటపడటంతో అప్పటినుంచి లారెన్స్ కూడా రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం మొదలుపెట్టారు ఇప్పటికీ ఈయన రాఘవేంద్ర స్వామిని ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు అలాగే రాఘవేంద్ర స్వామి మాల వేస్తూ కూడా తన భక్తిని చాటుకుంటూ ఉంటారు.ఇక తన తల్లి స్ఫూర్తితోనే లారెన్స్ పెద్ద అయిన తర్వాత కూడా ట్రస్ట్ ప్రారంభించి ఎంతోమందికి వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇలా ఎంతోమందికి పునర్జన్మను కల్పించినటువంటి లారెన్స్ చిన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడేవారు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ఈయన తాజాగా చంద్రముఖి సినిమా( Chandramukhi )తో పాటు జిగర్ తండ సినిమా( Jigarthanda ) ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.








