ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఈసారి తారా స్థాయికి చేరింది.ఉత్కంఠ పరిస్థితులు నడుమ కొందరు అభ్యర్థులు బాహాబాహీ కి కూడా తలపడ్డారు.
ముఖ్యంగా భారతీయ రాష్ట్ర సమితి( BRS party ) మరియూ కాంగ్రెస్ పార్టీ ల మధ్య ప్రధాన పోటి అని వార్తలు వచ్చినా చివరి నిమిషంలో బీసీ సీఎం, ఎస్టీ వర్గీకరణ వంటి అంశాలను కీలకంగా మార్చిన బిజెపి తాను కూడా రేసులో ఉన్నాను అంటుంది.జనసేనతో పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీకి కొంత కలిసి వచ్చినట్టే కనిపిస్తుంది.
ఈసారి తెలంగాణ ఎన్నికలలో ప్రచారం అంతా అవినీతికి ,అభివృద్ధికి మధ్యే జరిగింది.
ముఖ్యంగా ఒకప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లున్నది తెలంగాణ పేరుతో భారతీయ రాష్ట్ర సమితి తాము చేసిన అభివృద్ధిని, వివిధ రంగాలలో తమ పరిపాలన వల్ల జరిగిన మార్పులను అంకెలతో సహా వివరిస్తూ, ఈ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి తమకు వోట్లు వేయాలంటూ ప్రజలకు పిలుపునివ్వగా, మరోపక్క ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ( Congress )మాత్రం బారాస హాయములో జరిగిన అవినీతిని సిట్టింగ్ ఎమ్మెల్యేల దౌర్జన్యాలను ప్రజలకు మరోసారి గుర్తు చేసి ఇలాంటి పరిపాలనకు అంతం పలకాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.
అంతేకాకుండా తమదైన హామీలను ఇస్తూ తాము అధికారంలోకి వస్తే కులగణన కూడా చేపడతామంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది.ఇంకోపక్క కాంగ్రెస్ బిఆర్ఎస్ లు రెండూ కుటుంబ పార్టీలనని , ఈ పార్టీల పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ప్రజలకు పేదవాడికి మంచి జరిగింది బిజెపి ( BJP )పరిపాలనలోనని, అందువల్ల తమకే పట్టం కట్టాలంటూ బిజెపి నేతలు కూడా కాలికి బలపం కట్టుకుని తెలంగాణ అంతటా ప్రచారం చేశారు.మరి ప్రస్తుతానికి ఓటర్ల మన్ కీ బాత్ ఎలా ఉన్నా అధికారమే లక్ష్యంగా నాయకులు మాత్రం పూర్తి స్తాయిలో ప్రచారం చేశారు .ఇక మంగళవారం సాయంత్రం తో ప్రచారం పర్వం పూర్తయిప్రలోభాల పర్వానికి తేరలేస్తుంది.ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో నాయకులు డబ్బులు పంచడం కోసం టెక్నాలజీ సపోర్ట్ కూడా తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి .తమ నియోజక వర్గాలలో ఫోన్ పే నెంబర్లు గూగుల్ పే నెంబర్లను రిజిస్టర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది .