"యుద్ధం మొదలైంది" అంటూ పాదయాత్ర పై లోకేష్ అప్ డేట్..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) “యువగళం” పాదయాత్ర ( Yuvagalam Padayatra )మళ్ళీ పునః ప్రారంభం కాబోతోంది.ఈనెల 27వ తారీకు నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది.

 Lokesh Update On Padayatra Saying Yuddham Modhalaindi Tdp, Yuva Galam Pada-TeluguStop.com

దాదాపు 2000 కిలోమీటర్లకు పైగా 200 రోజులకు పైగా లోకేష్ పాదయాత్ర చేయడం జరిగింది.కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ యాత్ర.

సెప్టెంబర్ నెలలో రాజోలు నియోజకవర్గం వరకు సాగింది.మధ్యలో చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) కావటంతో.

లోకేష్ పాదయాత్రకి బ్రేక్ ఇచ్చారు.ఆ సమయంలో చంద్రబాబు కేసులకు సంబంధించిన న్యాయ వ్యవహారాలు మొత్తం దగ్గరుండి చూసుకున్నారు.

ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లతో మంతనాలు జరుపుతూ అప్పట్లో బిజీబిజీగా గడిపారు.ఒకపక్క పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూనే మరోపక్క చంద్రబాబు కేసు విషయంలో బెయిల్ కోసం లోకేష్ పెద్ద పెద్ద లాయర్లతో మంతనాలు జరిపారు.

ప్రస్తుతం చంద్రబాబుకి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయటం తెలిసిందే.ఈ క్రమంలో నవంబర్ 27వ తారీకు నుంచి పాదయాత్రకి లోకేష్ రెడీ కావడం జరిగింది.

ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా “యుద్ధం మొదలైంది” అంటూ.మీ అందరి ఆశీస్సులతో యువగళం పాదయాత్రను ఈ నెల 27న పునః ప్రారంభిస్తున్నాను అని తెలియజేశారు.

ఈ క్రమంలో చేతిలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని దిగిన ఫోటోను లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube