ఖమ్మం జిల్లా మధిరలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని తెలిపారు.
తెలంగాణలో భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారన్న విషయాన్ని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు.ఈ ఇద్దరూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పాదయాత్రలు చేశారని తెలిపారు.
తెలంగాణ కోసం చాలా మంది పోరాటం చేశారన్న ఆమె తెలంగాణ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వమే తమదని తెలిపారు.
తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.అంతేకాకుండా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.