తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ల కంటు ఒక ప్రత్యేక మైన ఇమేజ్ ఏర్పాటు చేసుకొని ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.ఇక ఇలాంటి వాళ్ళలో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఒకరు.
ఈయన చేసిన వరుస సినిమాలతో ఈయన మంచి నటుడు అనేది తెలిసిపోయింది.ఇక మరి ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో నటన లో ఆయన సత్తా ఏంటో తెలిసిపోయింది.
ఇక ఇలాంటి క్రమంలో ఈయన ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇప్పటికే లైగర్ సినిమా( Liger movie )తో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీసిన విజయ్ దేవరకొండ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో బాలీవుడ్ లో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.అయితే డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పటివరకు సస్పెన్స్ గా ఉన్నప్పటికీ తొందరలోనే ఈయన బాలీవుడ్ లో ఒక సినిమా అయితే చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పటికే ఈయన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.అది పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు పైన ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.ఒకవేళ మన రౌడీ హీరో బాలీవుడ్( Bollywood ) లోకి కనక వెళితే అక్కడ కూడా చాలా మంచి ఇమేజ్ సంపాదించుకుంటాడనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక విజయ్ దేవరకొండ కనక బాలీవుడ్ లో సెటిలైపోతే తెలుగు నుంచి ఇంకా చాలామంది యంగ్ హీరోలు కూడా బాలీవుడ్ కి వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి.మరి ఈయన అక్కడ ఏమి వరకు రాణిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…అయితే విజయ్ లౌగర్ హిట్ అయి ఉంటే ఎప్పటికీ బాలీవుడ్ లో సినిమా స్టార్ట్ చేసేవాడు కానీ లైగర్ ప్లాప్ కావడంతో తో ఆయనకి ఇప్పటి వరకు బాలీవుడ్ లో సినిమా చేసే అవకాశం అయితే రాలేదు…
.







