సీనియర్ హీరోయిన్ సుమలత( Sumalatha ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కర్ణాటకకు( Karnataka ) చెందిన సుమలత తెలుగులో సైతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించి సత్తా చాటారు.
ప్రస్తుతం సుమలత రాజకీయాలలో బిజీగా ఉండటం ఎక్కువ సినిమాలలో నటించడం లేదు.తాజాగా సుమలత తన భర్త, దివంగత నటుడు అంబరీశ్( Ambarish ) ను తలచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
అంబరీష్ మరణించి ఐదేళ్లు కాగా భర్తను తలచుకుంటూ సుమలత చేసిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.నువ్వు లేని ఈ ఒంటరి జీవితం నాలో చాలా మార్పు తెచ్చిపెట్టిందని సుమలత అన్నారు.
మన సంతోషం, దుంఖః, నవ్వు, కన్నీళ్లు ప్రతి నిమిషం ఎప్పటికీ గుర్తుంటాయని సుమలత అభిప్రాయం వ్యక్తం చేశారు.నా భర్త లేని లోటు లైఫ్ లాంగ్ తీర్చలేనిదని సుమలత పేర్కొన్నారు.

కానీ నా భర్త ప్రేమ ఎప్పటికీ నాతో ఉంటుందని ఆమె అన్నారు.నిన్ను ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని సుమలత కామెంట్లు చేశారు.నా లైఫ్ లో నువ్వు నాకున్న ఒకే ఒక ప్రపంచమని సుమలత అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈరోజు నా భర్త పైనుంచి నవ్వుతూ మన అభిషేక్ చిత్రాన్ని ఆశీర్వదిస్తారని సుమలత కామెంట్లు చేశారు.
సుమలత అంబరీష్ కొడుకు అభిషేక్ నటించిన బ్యాడ్ మ్యానర్స్ మూవీ( Bad manners movie ) ఈరోజు కర్ణాటక వ్యాప్తంగా విడుదలైంది.

అంబరీష్ సుమలత ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే.వీళ్లిద్దరి ప్రేమకథ సైతం ఎంతో ఆకట్టుకునేలా ఉంటుంది.1991 సంవత్సరం డిసెంబర్ నెల 8వ తేదీన సుమలత అంబరీష్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది.2018 సంవత్సరంలో అంబరీష్ గుండెపోటుతో మృతి చెందారు.ప్రస్తుతం మాండ్య నియోజకవర్గానికి సుమలత ఎంపీగా ఉన్నారు.







