తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.కత్తులు కడుపులో పెట్టుకుని రాష్ట్రానికి ఏపీ వాళ్లు వస్తున్నారని తెలిపారు.
తెలంగాణను వదిలిపెట్టి వెళ్లిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ వచ్చారని మంత్రి గంగుల విమర్శించారు.అలాగే పవన్ కల్యాణ్, కేఏ పాల్, వైఎస్ షర్మిల కూడా వచ్చారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్, షర్మిలకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు.ఏపీ నుంచి వచ్చి అందరూ కేసీఆర్ ను ఓడించాలని అంటున్నారని మండిపడ్డారు.
అయితే కేసీఆర్ లేకపోతే తెలంగాణ నాశనం అవుతుందని తెలిపారు.







