న్యాచురల్ స్టార్ నాని ( Nani ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు.గత సినిమా దసరాతో ఈయనకు అదిరిపోయే హిట్ పడగా ఇప్పుడు వెంటనే మరో సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు.
నాని ప్రస్తుతం ‘‘హాయ్ నాన్న”( Hi Nanna ) చేస్తున్నాడు.ఇది తన కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ గా తెరకెక్కింది.
ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్, టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.ఇక ఇటీవలే ట్రైలర్ కు డేట్ ఫిక్స్ చేస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు.ఈ సినిమా ట్రైలర్ ను నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.మరి తాజాగా ఈ ట్రైలర్ ఈవెంట్ గురించి మరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.ఈ ట్రైలర్ ను హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పివిఆర్ సినీ కాంప్లెక్స్ లో స్క్రీన్ 1 లో సాయంత్రం 5 గంటల నుండి ఈవెంట్ స్టార్ట్ చేయనున్నట్టు తెలిపారు.ఈ గ్రాండ్ ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసారు.
ఈ పోస్టర్ కూడా అదిరిపోయింది.మరి ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి…
కాగా ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా( Baby Kiara Khanna ) నాని కూతురు రోల్ పోషిస్తుండగా వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.నానికి ఈ సినిమా హిట్ ఇస్తుందో లేదో మరో 10 రోజులు ఆగితే తేలిపోనుంది.