అప్కమింగ్ సినిమాల విషయంలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ చాలా తెలివి గా తమ ప్లాన్స్ చేసుకుంటున్నారు.ఫాలో అవుతున్నారు కొంతమంది ఈ స్టార్ హీరోయిన్ల సరసన జోడి కట్టాలని ఆడుతుంటే మరి కొంతమంది కంటెంట్ ఉన్న సినిమాలకే తమ ఓటు అంటున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోయిన్స్ ఎవరి దారిలో వారు డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.మరి ఆ హీరోయిన్స్ ఎవరు ఎలాంటి జోనర్ చిత్రాలను ఎంచుకొని ముందుకెళ్తున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రియాంక అరుల్ మోహన్

ఈ వరుసలో ముందుగా నాని గ్యాంగ్ లీడర్ సినిమా హీరోయిన్ అయినటువంటి ప్రియాంక అరుల్ మోహన్( Priyanka Arul Mohan ) గురించి మాట్లాడుకోవాలి.ఈమె ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. శ్రీకారం అనే సినిమాలో నటించిన అది ఫ్లాప్ అయింది.కానీ ఇప్పుడు మాత్రం ఆమె హవానే టాలీవుడ్ లో గట్టిగా కనిపిస్తోంది.నాని తదుపరి చిత్రం సరిపోదా శనివారం సినిమా కోసం కూడా ప్రియాంకనే హీరోయిన్ గా తీసుకున్నారు.అలాగే పవన్ కళ్యాణ్ సరసన కూడా ప్రియాంక ఓజి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ రెండు సినిమాలు కాకుండా రవితేజ మరియు గోపీచంద్ మలినేని వంటి సక్సెస్ఫుల్ కాంబినేషన్లో ప్రియాంక హీరోయిన్గా నటిస్తోంది ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో కనిపించడం వల్ల కమర్షియల్ హీరోయిన్ గా ప్రియాంక గట్టిగా ఎలివేట్ అవుతుందని లో ఎలాంటి సందేహం లేదు.
నయనతార

ఇక కమర్షియల్ హీరోయిన్ గా ఎన్నో ఎత్తు పల్లాలను చూసినటువంటి నయనతార( Nayanthara ) కంటెంట్ డ్రివెన్ స్టోరీస్ కే తన ప్రాముఖ్యత ఇస్తుంది.ప్రస్తుతం ఆమె తీయబోతున్న సినిమాలన్నీ కూడా లేడీ సినిమాలే.జవాన్ సినిమాతో బాలీవుడ్ లో గట్టిగా తన డెబ్యూట్ చేసింది నయన్.
ప్రస్తుతం అన్నపూర్ని, టెస్ట్ అనే రెండు సినిమాలు కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కాగా, మన్నగంటి సిన్స్ 1960( Mannangatti Since 1960 ) అనే మరో కంటెంట్ మూవీ నయన్ ఒప్పుకోవడం విశేషం తదుపరిచిత్రాలన్నీ కూడా ఇదే తరహాలో ఉంటాయని అందరూ అనుకుంటున్నారు.







