బిగ్ బాస్ రివ్యూయర్ ఆదిరెడ్డి (Aadi Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బిగ్ బాస్ (Bigg Boss) రివ్యూ ఎంతో ఫేమస్ అయ్యారు.
ఇక గత సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొనే టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా కొనసాగిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి రివ్యూస్ ఇస్తూ వరుస వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా ఈయన చేసినటువంటి వీడియో పై రతిక ( Rathika ) సిస్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.తాజాగా ఒక వీడియోని షేర్ చేసిన ఆమె ఆది రెడ్డి పై ఫైర్ అయ్యారు.

మా అక్కను బ్యాడ్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెబుతున్నాను.మీ ఫ్యామిలీలో కూడా ఒక అమ్మాయి కష్టపడి పైకి వస్తే తన గురించి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చేస్తే మీరు ఎలా బాధపడతారో మా ఫీలింగ్ కూడా అలాగే ఉంటుందని తెలిపారు.వారి వ్యూస్ కోసం మా అక్కను బ్యాడ్ చేయడం సరి కాదని తెలిపారు.ఆదిరెడ్డి అనే యూట్యూబర్ ఇదివరకే బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చారు.అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఆయనకు తెలుసు.తన వ్యూస్ కోసం మా అక్క గురించి కావాలనే బ్యాడ్ రివ్యూస్( Bad Reviews ) ఇస్తున్నారు.

ఇలా బ్యాడ్ రివ్యూస్ ఇస్తూ తన అక్కను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని ఈమె ఆవేదన చెందారు.ఇలా మా అక్కను బ్యాడ్ చేసే అంత తప్పు తాను ఏం చేసిందని ఈమె ప్రశ్నించారు.ఆదిరెడ్డికి కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పరిస్థితులు ఏంటి అనేది స్పష్టంగా తెలుసు కదా అయినప్పటికీ ఇలా తన అక్క గురించి నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అంటే అది కేవలం తన వ్యూస్ కోసమే అంటూ ఈ సందర్భంగా రతిక సిస్టర్( Rathika Sister ) ఆదిరెడ్డి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.







