టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ( Balakrishna ) పేరు ప్రస్తావించకుండా విచిత్ర( Vichitra ) చేసిన సంచలన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.అయితే ఏపీలో ఎన్నికలకు ముందు విచిత్ర ఆరోపణలు చేయడం వెనుక బాలయ్యను పొలిటికల్ గా తొక్కేయాలని కుట్రలు ఉన్నాయా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య పేరు కానీ సినిమాపేరు కానీ విచిత్ర ప్రస్తావించలేదు.
భలేవాడివి బాసూ సినిమా తర్వాత కూడా విచిత్ర ఆరు సినిమాలలో నటించారు.బాలయ్య నిజంగా తప్పు చేసి ఉంటే అప్పట్లోనే మీడియా ముందుకు వచ్చి విచిత్ర ఆరోపణలు చేసి ఉంటే బాగుండేది.23 సంవత్సరాల తర్వాత ఆరోపణలు చేస్తే ప్రూవ్ చేయడం కూడా సులువు కాదనే సంగతి తెలిసిందే.విచిత్ర నిజంగా బాలయ్య తప్పు చేసి ఉంటే ఇప్పటికైనా తప్పు చేసింది అతనో కాదో క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
పేర్లు చెప్పకుండా చేసే ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.బాలయ్యతో పదుల సంఖ్యలో హీరోయిన్లు పని చేశారు.గతంలో రాధికా ఆప్టే( Radhika Apte ) ఒక సౌత్ హీరోపై ఆరోపణలు చేయగా ఆ సమయంలో కూడా బాలయ్య పేరు తెచ్చి విమర్శలు చేశారు.
ఆ సమయంలో బాలయ్యపై రాధిక ఆరోపణలు నిజమైతే ఆమె బాలయ్యతో మరో సినిమా ఎందుకు చేసిందనే ప్రశ్నకు మాత్రం జవాబు లేదు.
ఈ వివాదం గురించి బాలయ్య నోరు మెదుపుతారో లేదో చూడాల్సి ఉంది.నిజంగా హీరో తప్పుగా ప్రవర్తిస్తే ఆ సినిమాలో నటించకుండా వెళ్లిపోయే అవకాశం కూడా ఉంది.బాలయ్యపై విచిత్ర పరోక్షంగా చేసిన ఆరోపణల వెనుక ఎవరో ఉన్నారని కొంతమంది చెబుతున్నారు.
ఇలాంటి ఆరోపణల వల్ల ఇండస్ట్రీ పరువు పోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.విచిత్రపై బాలయ్య పరువు నష్టం దావా వేయాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.