తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి ఆమని ( Amani )పెళ్లి తర్వాతే కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి అలాగే ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్( Casting Couch ) గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తా
ను హీరోయిన్గా సినిమా అవకాశాలను అందుకోవడం కోసం ఎన్నో స్టూడియోలకు ఫోటోలు పంపించానని నా ఫోటోలు చూసి పిలిపించేవారు నన్ను చూసిన తర్వాత ఈ అమ్మాయా అసలు ఈ రంగు ఏంటి ఈమెలో టాలెంట్ ఉందా లేదా అంటూ ఎన్నో అనుమానాలతో తనని రిజెక్ట్ చేసేవారని తెలిపారు.కేవలం రంగు చూసి నన్ను రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయని ఆమని వెల్లడించారు.కనీసం వారికి టాలెంట్ ఉందా లేదా అనే విషయం కూడా గమనించకుండా నన్ను చూడగానే చాలామంది రిజెక్ట్ చేశారని ఈమె వెల్లడించారు.
ఇక మరి కొంతమంది సినిమా అవకాశాలు ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేశారని ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చాలా ఉంది అంటూ ఈమె తెలియజేశారు.సినిమా అవకాశాలు ఇచ్చిన తర్వాత కొందరు దర్శక నిర్మాతలు( Producers ) టూ పీసెస్ దుస్తులు ధరించాలి.స్ట్రెచ్ మార్కులు ఏమైనా ఉన్నాయా? ఒకసారి బట్టలు విప్పి చూపిస్తారా? వంటి ప్రశ్నలు కొందరు తనను అడిగారని చెప్పారు.ఏదైనా సినిమా ఒప్పుకుని అడ్వాన్స్ కూడా తీసుకున్న తర్వాత కథ గురించి మాట్లాడాలి మీరు ఫలానా బీచ్ కి రమ్మని నాకు కబురు కూడా పంపేవారు.అయితే సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఏ రంగంలో అయినా కూడా ఇలాంటివి ఉంటాయని కానీ మంచి ఏదో చెడు ఏదో ఎంపిక చేసుకొని అవకాశం మన చేతుల్లో ఉంటుందని ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మనల్ని ఎవరు ఏమి చేయలేరు అంటూ ఆమని తెలిపారు.