భారతదేశంలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న వాణిజ్య పంటలలో మొక్కజొన్న పంట ( Corn Crop Cultivation )కూడా ఒకటి.ఏడాది పొడవునా మొక్కజొన్న పంటను ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.
కాకపోతే శీతాకాలంలో మొక్కజొన్న పంటను సాగు చేస్తే మంచు వల్ల పంటకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది.శీతాకాలంలో మొక్కజొన్నను సాగు చేసే రైతులు( Farmers ) కొన్ని జాగ్రత్తలను పాటిస్తే పంటను సంరక్షించుకోవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.
ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.

శీతాకాలంలో మొక్కజొన్న కోతలు చేసిన తర్వాత మొక్కజొన్న గింజలలో తేమశాతం చాలా అధికంగా ఉంటుంది.కాబట్టి కోతల తర్వాత మొక్కజొన్న గింజలను నాలుగు లేదా ఐదు రోజుల వరకు ఎండలో ఎండబెట్టి తేమశాతం చాలావరకు తగ్గించుకోవాలి.మొక్కజొన్న పంట ( Corn Crop )మంచి ధర పలకాలంటే గింజలలో 14 తేమ శాతం ఉండాలి.
తేమశాతం అధికంగా ఉంటే మొక్కజొన్న గింజలను నిలువ ఉంచితే బూజు వచ్చి చెడి పోయే అవకాశం ఉంది.కాబట్టి మొక్కజొన్నలను బాగా ఆరబెట్టిన తర్వాత పరిశుభ్రంగా ఉండే పాలిథిన్ సంచులు లేదంటే గోనె సంచులలో నింపి మంచు కురువని ప్రాంతాలలో నిలువ చేయాలి.
నిలువ చేసే ప్రదేశంలో పురుగులు, ఎలుకలు, శిలీంద్రాలు లాంటి వాటి వల్ల నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

మొక్కజొన్న గింజలు గట్టి పడ్డాకనే కోతలు చేయడం మంచిది.కోతల తర్వాత రోటవేటర్ సహాయంతో నేలను దున్నుకోవాలి.ఈ మొక్కజొన్న చొప్ప నేలలో కలిసిపోయి కుళ్ళిపోతే నేలలో పోషకాల నిలువ పెరుగుతుంది.
ఈ మొక్కజొన్న చొప్పలో 35 కిలోల పోటాష్, 35 కిలోల నత్రజని( Nitrogen ), 15 కిలోల భాస్వరం ఉంటాయి.కాబట్టి మొక్కజొన్న చొప్ప కుళ్ళిపోయి నేలలో కలిసిపోతే నేలకు సూక్ష్మ పోషకాలు అంది నేలలో సారం పెరుగుతుంది.
ఆ తర్వాత వేసే పంటకు పోషకాలు సంపూర్ణంగా అందే అవకాశం ఉంటుంది.







