ప్రస్తుత రోజుల్లో అధిక శాతం మంది అధిక బరువు సమస్య( Overweight problem )తో సతమతం అవుతున్నారు.ఈ క్రమంలోనే కొందరు బరువును తగ్గించుకోవడం కోసం కఠినమైన డైట్ ఫాలో అవ్వడమే కాకుండా నిత్యం వ్యాయామం చేస్తున్నారు.
అయితే కొందరికి వ్యాయామం చేసేంత సమయం ఉండదు.అలా అని మీరు చింతించాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే, వ్యాయామం చేయకుండా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు.అలా లాస్ అవ్వాలి అంటే మీరు కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే టిప్స్ నుఫాలఅవ్వాలిప్రోటీన్ మరియు ఫైబర్.
ఈ రెండు బరువు తగ్గడానికి ఉత్తమంగా హెల్ప్ చేస్తాయి.అందువల్ల మీరు మీ డైట్ లో ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ ను చేర్చుకోండి.
ప్రోటీన్ మరియు ఫైబర్ తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది.దీంతో మీ మనసు తరచూ ఆహారంపై మళ్లకుండా ఉంటుంది.
అలాగే ఆహారం తినే సమయంలో బాగా నమిలి తినండి.అలా నమిలి తినడం వల్ల మీరు తక్కువగా తింటారు.మీరు భోజనం చేసే ప్లేట్ సైజు తగ్గించండి అంటే చిన్న ప్లేట్ లో భోజనం చేయండి.ఎందుకంటే చిన్న ప్లేట్ లో కొంచెం ఫుడ్ పెట్టుకున్నా కూడా ఎక్కువగా అనిపిస్తుంది.
దాంతో మీరు తక్కువగా తింటారు.ఇది క్రమంగా వెయిట్ లాస్ దారితీస్తుంది.
బరువు తగ్గాలి అని అనుకునేవారు బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.అందుకు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.
అలాగే బరువు అదుపులో ఉండాలంటే కంటి నిండా నిద్ర( sleep ) ఎంతో అవసరం.కంటి నిండా నిద్ర లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది.
ఒత్తిడి పెరిగితే ఏది పడితే అది తినేస్తారు.దీంతో మీ బాడీ వెయిట్ భారీగా పెరుగుతుంది.
అందుకే రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర కచ్చితంగా ఉండేలా చూసుకోండి.
బరువు తగ్గాలి అనుకుంటే బయట ఆహారాలను కట్ చేయండి.అవుట్ సైడ్ ఫుడ్స్ లో ఏవేవో కలిపేస్తుంటారు.వాటిని తింటే బరువు పెరగడమే కాదు మీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది.
కాబట్టి బయట ఆహారానికి బదులు ఇంట్లో వండుకుని తినండి.కొందరు తినే సమయంలో ఫోన్, టీవీ వంటివి చూస్తుంటారు.
కానీ ఏదైనా ఏకాగ్రతతో తింటేనే ఒంటికి పడుతుంది.కాబట్టి ఫుడ్ తినే కాసేపైనా అన్ని పనులు పక్కన పెట్టి ప్రశాంతంగా తినండి.
ఇక షుగర్ ను పూర్తిగా దూరం పెట్టండి.రోజుకు ఒక హెర్బల్ టీ( Herbal tea ) తీసుకోండి.
మరియు సీజనల్ పండ్లను డైట్ లో చేర్చుకోండి.ఈ టిప్స్ అన్నీ పాటిస్తే మీరు వ్యాయామం చెయ్యకపోయినా కూడా బరువు తగ్గుతారు.