తెలంగాణలో ఎన్నికల వేడి తుది అంకానికి చేరుకుంది.దాదాపు ఎన్నికల ప్రచారానికి సంబంధించి అన్ని ప్రదాన అస్త్రాలనూ వాడేసిన అధికార ప్రతిపక్షాలు ఇక చివరి దశలో తాయిలాల పంపకంపై దృష్టి పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి .
అదేవిధంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు( AP Assembly Elections ) చూస్తే మరో మూడు నాలుగు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఇప్పుడు అక్కడ కూడా నెమ్మదిగా ఎన్నికల వేడి రాజుకుంటుంది.ప్రదాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు( Chandrababu Naidu ) సాధారణ బెయిలు కూడా మంజూరవడంతో ఇక ఇరుపక్షాలు బలాబలాలను సమకూర్చుకుంటున్నాయి.
జనసేన తెలుగుదేశం( TDP ) ఒకపక్క అధికార వైసిపి( YCP ) మరోపక్క నిలబడి పోరాడుతాయని ఇప్పటికే కన్ఫామ్ అయిపోయినా బిజెపి ఎటువైపు ఉంటుందో ఇప్పటివరకూ ఒక అంచనా లేదు.ఎలానో ఆంధ్రప్రదేశ్లో బిజెపికి చెప్పుకోదగ్గ ప్రభావం లేదు కాబట్టి ప్రధానంగా ఈ రెండు వర్గాల మధ్య పోరుగా ఎన్నికలను చూడాల్సి వస్తుంది.
అయితే తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీల లో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ఇప్పుడు కార్యకర్తల సమన్వయం పై రెండు పార్టీలు ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

ప్రత్యక్ష రాజకీయ సమావేశాలలో పాల్గొనటానికి చంద్రబాబుకు ఈనెల 30వ తారీకు నుంచి అనుమతి దొరకడంతో ఇక కార్య క్షేత్రంలో చంద్రబాబు తన పని మొదలు పెడతారని వార్తలు వస్తున్నాయి.అధికారికంగా ప్రకటించకపోయినా నిశ్శబ్దంగా అభ్యర్థులు ఎంపిక జరుగుతుందని తెలుగుదేశం మరియు జనసేన( Janasena ) గట్టిగా పట్టుపడుతున్న సీట్లపై ఇప్పటికే ఇరు పార్టీల అధిష్టానాలు ఫోకస్ పెట్టాయని సంప్రదింపులు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.జనసేన తోడ్పాటు ఎన్నికల్లో అత్యవసరమైన భావిస్తున్న చంద్రబాబు ఒక మెట్టు దిగటానికి కూడా సిద్ధమైనట్లుగా ఆ దిశగా తమ కీలక నాయకులను ఒప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది.

అదేవిధంగా జనసేన కూడా తమ బలాబలాలను బేరీజు వేసుకుని సీట్లను తీసుకోవాలి తప్ప పట్టుదలకు పోకూడదని నిర్ణయించుకోవడంతో ఈ రెండు పార్టీల పొత్తు 100% విజయవంతం అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది.మరో పక్క అధికార పార్టీ కూడా ఈ మూడు నెలల సమయాన్ని ప్రజాభిమానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించబోతున్నట్లుగా తెలుస్తుంది.మరి బలాలు బలగాలు సమకూర్చుకుంటున్న రెండు వర్గాలు కు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగడమే తరువాయి.ఎవరికి వారు తామే పాండవులం అని చెప్పుకుంటున్నారు కానీ అంతిమ తీర్పు ప్రజల చేతుల్లోనే ఉంది.