విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.బాధితులను ఆదుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలను వెలికి తీయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.ఈ క్రమంలోనే మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.
బోట్లు కోల్పోయిన మత్స్యకారులను ఆదుకోవాలని, అన్ని రకాలుగా వారికి సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రమాదంలో కాలిపోయిన ఒక్కో బోటు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.మరోవైపు ఫిషింగ్ హార్బర్ వద్ద గంగపుత్రులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.







