అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు.ఈ మేరకు ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన ఇవాళ నాలుగు ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు.
అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ మరియు కల్వకుర్తిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసింది.కాగా సభల్లో పాల్గొననున్న కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను మద్ధతుగా ప్రచారం చేయనున్నారు.
దాదాపు పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరించనున్నారు.







