సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ప్రజెంట్ గుంటూరు కారం చేస్తున్న విషయం తెలిసిందే.ఈయన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలుసు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుందా లేదా అని మొదట్లో ఫ్యాన్స్ నుండి కూడా చాలా అనుమానాలు వచ్చాయి.
అయితే ఈ అనుమానాలకు మేకర్స్ చెక్ పెట్టారు.మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చిన అనుకున్న డేట్ కు సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ చాలానే కష్ట పడ్డారు.
ఇప్పటికే షూట్ చివరి స్థాయికి చేరుకుంది.అయితే ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ రెండు వారంలోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.ఇదే టార్గెట్ దిశగా షూటింగ్ కూడా సాగుతుంది.ప్రజెంట్ క్లైమాక్స్ షూట్ జరుగుతున్నట్టు టాక్.అయితే ఈ సినిమా షూట్ పూర్తి కాగానే మహేష్ తన ప్లాన్ చేసుకున్నాడు…
ఈయన ఎప్పుడు షూట్ కాళీ అయినా ఫ్యామిలీతో కలిసి టూర్స్ కు వెళుతుంటాడు.మరి ఈసారి కూడా గుంటూరు కారం షూట్ అలా పూర్తి అవ్వగానే న్యూ ఇయర్ కోసం విదేశాలకు వెళ్లనున్నారట.ఆ వెంటనే తిరిగి వచ్చి గుంటూరు కారం ప్రమోషన్స్ లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారని టాక్.మరి మహేష్ ప్లానింగ్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
కాగా మహేష్, త్రివిక్రమ్ ( Trivikram Srinivas ) సూపర్ హిట్ కాంబో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ( SreeLeela Meenakshi Chaudhary )హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.
ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.