కాంగ్రెస్ అభ్యర్థి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్( KTR ) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శుక్రవారం ప్రచారంలో పాల్గొన్నారు.గతంలో రెండుసార్లు ఇక్కడినుండే ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్.

 Ktr Sensational Comments On Cricketer Azharuddin Brs, Ktr, Telangana Elections,-TeluguStop.com

మూడోసారి కూడా పోటీకి దిగుతున్నారు.ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి గోపీనాథ్( Maganti Gopinath) నీ గెలిపించాలని కోరారు.

గోపీనాథ్ వచ్చాక జూబ్లీహిల్స్ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ తెలియజేశారు.

ఇక ఇదే సమయంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ( Azharuddin )పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా అజారుద్దీన్ ఓట్ల కోసం వస్తే.ఆయనతో క్రికెట్ ఆడించండి.తాను కూడా అజారుద్దీన్ అభిమానినే అని.ఆయన ఒక గొప్ప క్రికెటర్ కానీ.గొప్ప రాజకీయ నేత మాత్రం కాదు.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీలు, కాలనీలు కూడా ఆయనకు తెలియవు.గతంలో ఉత్తర ప్రదేశ్ లో మొరాదాబాద్ లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన మళ్లీ ఆ నియోజకవర్గము వైపు వెనుదిరిగి చూడలేదు.జూబ్లీహిల్స్ లో కూడా అదే జరుగుతుంది.

ఆయన నియోజకవర్గంలోకి వస్తే పిల్లలతో క్రికెట్ ఆడించండి ఓటు మాత్రం మాగంటి గోపీనాథ్ కి వెయ్యండి అని మంత్రి కేటీఆర్ రోడ్ షోలో ప్రసంగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube