సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై స్పందించారు.
కాంగ్రెస్ ది 420 మ్యానిఫెస్టో అని మంత్రి హరీశ్ రావు అన్నారు.కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కానీ హామీలను ఇస్తోందన్నారు.
మ్యానిఫెస్టోతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.ప్రజలెవరూ కాంగ్రెస్ నమ్మొద్దని సూచించారు.
అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేసిన కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణలో మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.