కేసీఆర్ ( KCR ) రాజకీయాల్లో అపరచాణుక్యుడిగా పేరు తెచ్చుకున్నారు.అయితే కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం తేవడంలో ఎన్నో నిరాహార దీక్షలు చేసి ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఆ సెంటిమెంట్ తో పార్టీని స్థాపించి రెండుసార్లు ఎన్నికల్లో గెలిచారు.
ఈయనది ప్రాంతీయ పార్టీ.అలాగే ఆంధ్రప్రదేశ్ వైసీపీ (YCP) పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ నే.వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు.ఇక ఏపీ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ మనుషులు మాత్రం కలిసే ఉన్నారు.
అయితే ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తూ 90% సీట్లను సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇచ్చారు.
అయితే ఇప్పటివరకు సంక్షేమ పథకాల పేరుతో కెసిఆర్ ( KCR ) ఓట్లు సంపాదించినప్పటికీ దశాబ్దం కాలం పాటు తెలంగాణను ఏలిన ఈ పార్టీ వాళ్లు సంక్షేమ పథకాలన్నీ తమకు సంబంధించిన వాళ్లకు మాత్రమే కట్టబెట్టారు.కానీ ప్రజలకు ఏమాత్రం అందనివ్వలేదు.ఇక ఈ లెక్కన ఎమ్మెల్యేలపై చాలావరకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
అయినప్పటికీ పార్టీ అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్ కొడుతుందని కెసిఆర్ భావిస్తున్నారు.అయితే ఓ వైపు ధీమా గా ఉన్నప్పటికీ మరోవైపు కెసిఆర్ కి భయం పట్టుకుంది.
ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టడానికి స్వయంగా కేసీఆర్ బయటికి వచ్చి బహిరంగ సభలు పెట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఓట్లు సాంపాదించాలి అని చూస్తున్నారు.అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం కేసీఆర్ ఏ మాత్రం భయపడడం లేదు.
కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ( Jagan mohan reddy ) మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో చాలా భయపడుతున్నారు.ఇక ఆంధ్రాలో ఇప్పటివరకు సగానికంటే ఎక్కువ వైసిపి ప్రభుత్వానికి ప్రజలు అండదండగా ఉన్నారు.
అయినప్పటికీ మళ్లీ వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలంటే 30 నుండి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించి వారి స్థానంలో ప్రజాధరణ పొందిన నాయకులను నియమించాలని జగన్ భావిస్తున్నారట.
అంతేకాదు ఇప్పటికే పలుమార్లు మళ్లీ అధికారంలోకి వైసిపి పార్టీ రావాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంతమందిని మార్చాల్సిందే అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు.అయితే సంక్షేమ పథకాలు తమకు అంతగా పేరు తెచ్చి పెట్టలేదా లేక సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో జగన్ భయపడుతున్నారా తెలియదు కానీ కెసిఆర్ కి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్నంత నమ్మకం జగన్ కి మాత్రం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.