టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలోని స్టార్ సింగర్లలో సునీత ఒకరు కాగా సునీతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీ రేంజ్ లో ఉంది.సునీత వాయిస్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
సునీత ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పగా ఆమె డబ్బింగ్ సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.రెండో పెళ్లి సమయంలో సింగర్ సునీతపై( Singer Sunitha ) వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు.
ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసేలా కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ లైఫ్ లో ఎత్తుపల్లాలు సాధారణమని కానీ వాటిని ఎలా ఎదురించి నిలబడ్డామనేది ముఖ్యమని అన్నారు.
నా లైఫ్ లో జరిగిన చాలా విషయాలు మరిచిపోయానని కొన్నిసార్లు నా బంధువులే ఆరోజు అలా జరిగితే ఎలా ఏడ్చావో తెలుసా అని చెబుతారని సునీత చెప్పుకొచ్చారు.అంతలా అన్నింటినీ మరిచిపోయానని సునీత కామెంట్లు చేశారు.

చాలా విషయాలలో నేను మోసపోయానని నాపై వచ్చిన విమర్శలకు అయితే లెక్కే లేదని ఆమె అన్నారు.వేర్వేరు రీజన్ల వల్ల 19 ఏళ్లకే పెళ్లైందని చిన్న వయస్సులోనే పెళ్లి జరగడంతో కుటుంబ బాధ్యతలు నాపై పడ్డాయని సునీత అన్నారు.నాన్న బిజినెస్ లో నష్టం రావడంతో ఇల్లు కూడా పోయిందని నా చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేశారని మోసపోయిన ప్రతిసారి నేను షాకయ్యేదాన్ని అని ఆమె తెలిపారు.

నా నవ్వు ఫేక్ గా ఉంటుందని చాలామంది విమర్శలు చేశారని సునీత వెల్లడించారు.నా గురించి ఏదైనా చెప్పడం ఇష్టం లేకపోతే నవ్వి వదిలేస్తానని సునీత అన్నారు.సునీత చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సునీతకు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సునీతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.







