ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2024 ఎన్నికల్లో తమ పార్టీ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తుంది అని ప్రజా శాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ పేర్కొన్నారు.ఆయన ఆశిల మెట్టలో గల పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
బీజేపీ ఎంపి నరసింహా రావు విశాఖ ఎంపి గా పోటీ చేస్తే ప్రజలు ఓట్లు వేయరు అని స్పష్టం చేశారు.కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, స్మార్ట్ సిటీ పూర్తి చేయ లేదు, దేశంలో రెండు కోట్ల ఉపాధి కల్పన లేదు, ప్యాకేజీ ఇవ్వలేదు అని దుయ్యబట్టారు.
స్టీల్ ప్లాంట్ లో గల 19 వేల ఎకరాల భూములు అమ్మకాల కోసం సన్నాహాలు చేస్తున్నారు అని మండి పడ్డారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ లు 90 శాతం గా ఉన్నప్పటికీ వెనుక బడి వున్నారు అని వాపోయారు.
తెలంగాణ సీఎం కెసిఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లకు ప్రధాని మోడీ ఢీకొనే దమ్ము లేదు విశాఖ ను అభివృద్ధి చేయడానికి ఎంపి గా పోటీ చేస్తానని అన్నారు.తాను గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాను అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా పాటు పడతాను అన్నారు.చారిటే కింద ప్రజలకు ఎంతో సేవలు చేశాను అని గుర్తు చేశారు.
పార్లమెంట్ లో కొత్త కొత్త బిల్లులు పెడుతున్నారు, మద్దతు ఇవ్వని వారిని పైకి పంపుతున్నారు అని ఆరోపించారు.టీడీపీ మునిగిపోయే పార్టీ అన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సమ్మిట్ నిర్వహణ కోసం సీఎం జగన్ ను కలుస్తాను అన్నారు.మీడియా సమావేశంలో ప్రజా శాంతి పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.