ఈమధ్య కాలంలో స్టార్ సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది.ముందుగా సమంత మరియు నాగ చైతన్య నుండి ఇది ప్రారంభం అయ్యింది.
ఆ తర్వాత వరుసగా ఒకరి తర్వాత ఒకరు క్యూలు కట్టి మరీ విడాకులు తీసుకున్న ఘటనలు ఈమధ్య కాలం లో చాలానే చూసాము.సెలెబ్రిటీల హోదాలో ఉంది ఇలా చేస్తుంటే సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్టో అర్థం కావడం లేదు.
ఎక్కువగా మెగా ఫ్యామిలీ లోనే ఇలాంటివి చోటు చేసుకున్నాయి.చిరంజీవి రాజకీయాల్లో వచ్చిన కొత్తలో చిన్న కూతురు శ్రీజా, భరద్వాజ్ అనే అతన్ని ప్రేమించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకొని మెగా ఫ్యామిలీ పరువు తీసిన సంగతి అందరికీ తెలిసిందే.
అతనితో సంతానం పొందిన తర్వాత ఆమె కొన్నాళ్ళకు విడాకులు తీసుకొని పెద్ద షాక్ ఇచ్చింది.చిరంజీవి శ్రీజా ని మళ్ళీ తన ఇంటికి తీసుకొచ్చి కళ్యాణ్ దేవ్( Kalyaan Dhev ) అనే వ్యక్తితో గ్రాండ్ గా రెండవ పెళ్లి చేసాడు.
కొంతకాలం మంచిగానే సంసారం జీవితం కొనసాగించినప్పటికీ, కొన్ని అనుకోని సంఘటనలు వీళ్లిద్దరి జీవితం లో చోటు చేసుకోవడం, విడిపోవడం వంటివి జరిగింది.కళ్యాణ్ దేవ్ తో కూడా శ్రీజా ఒక బిడ్డకి జన్మని ఇచ్చిన సంగతి తెలిసిందే.కొద్దిరోజులు ఆ బిడ్డ శ్రీజా( Sreeja ) దగ్గర ఉంటే, మరికొద్ది రోజులు కళ్యాణ్ దేవ్ తో ఉంటుంది.మరో విశేషం ఏమిటంటే శ్రీజా మొదటి భర్త కూతురుతో కూడా కళ్యాణ్ దేవ్ ఎంతో మంచి సాన్నిహిత్యం ని మైంటైన్ చేస్తున్నాడు.
ఈమెని కూడా రీసెంట్ సమయం లో ఎన్నో సార్లు కలిసిన సందర్భాలు మనం అతని ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో చూస్తూనే ఉన్నాం.ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే, వీళ్లిద్దరు విడాకులు రద్దు చేసుకొని మళ్ళీ ఒకటి అయిపోబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.
ఈమధ్య శ్రీజా మరియు కళ్యాణ్ దేవ్ లు పరోక్షంగా పెడుతున్న కొన్ని కొటేషన్స్ ని చూస్తుంటే ఇది అర్థం అవుతుంది.
ఇదే కనుక నిజంగా జరిగితే మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తారు.శ్రీజా( Sreeja ) విషయం లో మెగా ఫ్యాన్స్ కి మొదటి నుండి అసంతృప్తి ఉండేది.ఒకసారి చిరంజీవి పరువు తీసింది, రెండవ సారి కూడా విడాకులు తీసుకొని ఆయన్ని మరోసారి తలెత్తుకోనివ్వకుండా చేసింది, కొడుకు రామ్ చరణ్ చిరంజీవి( Ram Charan , Chiranjeevi ) కీర్తి ప్రతిష్టలను ప్రపంచం నలుమూలల వ్యాప్తి చేస్తుంటే, శ్రీజా మాత్రం ఆయన పరువు తీస్తుంది అంటూ వాపోయారు మెగా ఫ్యాన్స్.
ఇప్పుడు వారికి ఈ వార్త వినపడుతుండడం తో కాస్త ఊరట లభించింది.