Hansika : ఈటింగ్ ఒక వేస్ట్ ఆఫ్ టైమ్‌.. నేను ఏమీ తినకుండా ఒకట్రెండు రోజులు బతకగలను: హన్సిక

ప్రముఖ నటి హన్సిక మోత్వానీ( Hansika ) దేశముదురు, కంత్రి, మస్కా, జయీభవా, దేనికైనా రెడీ సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది.తర్వాత ఆమె కొన్ని తెలుగు సినిమాలు తీసింది కానీ అవేమీ హిట్ కాలేదు.

 Hansika About Her Food Habits-TeluguStop.com

తమిళ సినిమాల్లో బిజీ కావడం వల్ల ఆమెకు టాలీవుడ్ లో బాగా గ్యాప్ కూడా వచ్చింది.ఇప్పుడు తెలుగులో 105 మినిట్స్, మై నేమ్ ఈజ్ శ్రుతి సినిమాలు చేస్తోంది.తమిళంలో కూడా మూడు మూవీలకు సంతకం చేసింది.“మై నేమ్ ఈజ్ శ్రుతి( My Name Is Shruthi )” మూవీ ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.యీ మూవీ ఆర్గాన్ హార్వెస్టింగ్ మాఫియా చుట్టూ తిరుగుతుంది.ఇది రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హన్సిక తెలుగు యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తోంది.

Telugu Allu Arjun, Desamu Duru, Habits, Hansika, Kollywood, Shruthi, Pav Bhaji,

తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఫుడ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.ఫుడ్ విషయంలో పర్టిక్యులర్ గా ఉంటారా అని ప్రశ్నించినప్పుడు… “నాకు ఈటింగ్ అంటే అసలు ఇష్టం ఉండదు.ఈటింగ్‌ను నేను అసలు ఎంజాయ్ చేయను.

తినడాన్ని ఒక వేస్ట్ ఆఫ్ టైమ్‌గా భావిస్తా.ఏదో బతకడానికి తినాలి కాబట్టి తప్పక తింటున్నాను.

నా స్కిన్ హెల్త్ కోసం సన్‌స్క్రీన్ వాడతా, పడుకునే ముందు మేకప్ మొత్తం తీసేస్తా.చాలామంది నేను ఫూడీ అనుకుంటారు.

కొన్ని సినిమాల్లో నేను చబ్బిగా కనిపించా.అది తినడం వల్ల చబ్బి కాలేదు, అది జస్ట్ బేబీ ఫ్యాట్ అంతే.

ఫుడ్ అసలు ఎంజాయ్ చేయను.ఒకటి, రెండు రోజులు ఏమీ తినకుండా ఈజీగా ఉండగలను.నేను ఎప్పుడైనా తినగలిగే ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది ఒక పావు బాజీ( Pav bhaji ) మాత్రమే.” అని హన్సిక చెప్పుకొచ్చింది.

Telugu Allu Arjun, Desamu Duru, Habits, Hansika, Kollywood, Shruthi, Pav Bhaji,

ఫుడ్ ఒక వేస్ట్ ఆఫ్ టైమ్‌ అని సన్స్ కట్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.హీరోయిన్లు ఫ్రూట్స్, ఇంకా ఏవేవో డైట్స్‌ ఫాలో అవుతూ ఉంటారు.అప్పుడప్పుడు వెకేషన్స్‌లో ఉన్నప్పుడు టేస్టీ ఫుడ్ ఐటమ్స్ కూడా తిని ఎంజాయ్ చేస్తారు.కానీ హన్సిక మాత్రం ఈటింగ్ పై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం కొద్దిగా విడ్డూరంగానే అనిపిస్తుంది.

ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలవడం పట్ల తనకు సంతోషంగా ఉందని కూడా తెలిపింది.ఈ ముద్దుగుమ్మ దేశముదురు సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube