ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ( Bigg Boss House )లో ఎవ్వరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.షో ప్రారంభానికి ముందే ‘ఉల్టా పల్టా’ అని నాగార్జున( Nagarjuna ) క్యాప్షన్ ఇచ్చాడు.
ఇలాంటి క్యాప్షన్లు వంద చెప్తారు, కానీ అక్కడ అంత సీన్ ఏమి ఉండదు లే అని అందరూ అనుకున్నారు.ఎందుకంటే గత సీజన్ మిగిల్చిన చేదు అనుభవాలు అలాంటివి.
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలు, రీ ఎంట్రీలు వంటివి ఉండడం.కంటెస్టెంట్స్ గ్రాఫ్స్ తారుమారు అవ్వడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా నాలుగు వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన రతికా, ( Rathika Rose )ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యి మళ్ళీ మూడు వారాల తర్వాత హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.ఈమె రీ ఎంట్రీ అదిరిపోతోంది, కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచే రేంజ్ లో ఆడుతుంది అని అందరూ అనుకున్నారు.
కానీ రీ ఎంట్రీ లో ఆమె అటు టాస్కులు ఆడడం లేదు, ఎంటర్టైన్మెంట్ పంచడం లేదు.అద్భుతంగా గేమ్స్ ఆడే యావర్ లాంటి కంటెస్టెంట్ ఆటని చెడగొట్టేందుకే ఆమె రీ ఎంట్రీ ఇచ్చిందా అనే అనుమానం వచ్చింది అందరికీ.ఆమె దెబ్బకి యావర్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది.మళ్ళీ ఆయన ట్రాక్ లోకి రావడానికి ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ టాస్కు లో నాలుగు రౌండ్స్ గెలవాల్సి వచ్చింది.
ఈ వీకెండ్ ఆమె డేంజర్ జోన్ లో ఉంటే యావర్ కచ్చితంగా రతికా ని సేఫ్ చెయ్యడం కోసమే ఉపయోగిస్తాడు.అందులో ఎలాంటి సందేహం లేదు.అలా చేస్తే యావర్ ఈ వారం కం బ్యాక్ ఇచ్చినందుకు ఎలాంటి ఉపయోగం లేదు తనకి.ఇదంతా పక్కన పెడితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గత వారం ఓటింగ్ గురించి ఒక షాకింగ్ నిజం తెలిసింది.
అదేమిటి అంటే గత వారం లో నామినేషన్స్ లోకి వచ్చిన అందరికంటే రతికా కి ఎక్కువ ఓట్లు వచ్చాయట.ఇది నిజంగా ఎవ్వరూ కలలో కూడా ఊహించనిది.అది కూడా ఆమెకి ఏ రేంజ్ ఓటింగ్ వచ్చింది అంటే, శివాజీ( Sivaji ) ని సైతం డామినేట్ చేసే రేంజ్ లో వచ్చింది అన్నమాట.శివాజీ కి తన ఫ్యాన్స్ ఓట్లు మాత్రమే కాకుండా, పల్లవి ప్రశాంత్ ఓట్లు కూడా యాడ్ అవుతాయి.
అయినా కూడా రతికా శివాజీ ని దాటింది అంటే ఇది మామూలు విషయం కాదు.సోషల్ మీడియా లో రతికా ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు.
ఎందుకంటే బిగ్ బాస్ కన్నింగ్ స్నేక్ అని ఆమెకి ఒక పేరు ఉంది.ఆమె ఆటని ఎవ్వరూ నచ్చడం లేదు, అయినా కూడా ఆమెకి ఓట్లు ఎవరు వేసర్రా బాబు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.