కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు విమర్శలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు.

 Minister Harish Rao Criticizes Congress Leaders-TeluguStop.com

కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మొబైల్ ఛార్జింగ్ పెట్టడానికి కూడా కరెంట్ ఉండటం లేదని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలు మాయ మాటలు చెబుతున్నారన్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ మాటలను ప్రజలెవరూ నమ్మొద్దని చెప్పారు.సుమారు యాభై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్న మంత్రి హరీశ్ రావు గ్యారెంటీ పథకాలంటూ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అయితే బీఆర్ఎస్ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వస్తుందన్నారు.ఈ క్రమంలో తాము అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి పూర్తి హక్కులు కల్పిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube