అసెంబ్లీ ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారంపై మరింత దృష్టి సారించింది.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టింది.ఈ మేరకు ఈనెల 25న భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.
సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయనున్న సభకు అనమతి కూడా లభించింది.దీంతో సభ కోసం భారీగా జనసమీకరణ దిశగా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఇదే కావడం విశేషం.







