తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది.ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకులు సైతం బహిరంగ సభలలో పాల్గొంటూ ప్రజలకు సంచలన హామీలు ఇస్తున్నారు.
ఇప్పటికే ప్రధాని మోదీ ( Narendra Modi )తెలంగాణలో పలుమార్లు పర్యటించడం జరిగింది.త్వరలోనే హైదరాబాదులో మరోసారి పర్యటించి భారీ ర్యాలీ చేయడానికి మోదీ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ నెల 18న నాలుగు చోట్ల.కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభలలో పాల్గొనబోతున్నారు.
తెలంగాణలో బీజేపీ పార్టీని గెలిపిస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ హామీ ఇవ్వడం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా కరీంనగర్ జిల్లాలో ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్( Etala Rajender ) ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా వాళ్లు నన్ను ముఖ్యమంత్రిని చేస్తారని అంటున్నారు.సీఎం అయినా గాని సాదాసీదాగా ఉంటా.నా కోసమే.సీఎం కుర్చీ కోసమే కాదు.
ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి పనిచేస్తానని ఈటల వ్యాఖ్యానించారు.నవంబర్ 28వ తారీకుతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది.
నవంబర్ 30వ తారీకు ఎన్నికలు జరుగునున్నాయి.దీంతో ఇప్పుడు కేవలం రెండు వారాలు మాత్రమే టైమ్ ఉండటంతో.
ప్రచారంలో ప్రధాన పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.