శరీరంలో అతి పెద్ద అవయవం చర్మమేనని చాలామందికి తెలియదు.అయితే చర్మం మీద వచ్చే మచ్చలు, గాయాల వెనుక అకాంథోసిస్ మైగ్రికన్ మచ్చలు( Acanthosis migrican spots ) కూడా కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
ఇవి తగ్గాలంటే మాత్రం శరీరంలో చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచుకోవాలని కూడా చెబుతున్నారు.లేదంటే చాలా పెద్ద ప్రమాదమే అని కూడా చెబుతున్నారు.
ఇది చర్మం లో జరుగుతున్న మార్పులకు సంకేతం అని కూడా చెబుతున్నారు.ఈ సమస్య తో చర్మం పై నల్ల మచ్చలు ఏర్పడతాయి.
ఇవి మెడ, చంకలు, నడుము వంటి ప్రదేశాలలో కనిపిస్తాయి.కొన్ని సార్లు చేతులు, మోచేతులు, మోకాళ్ల పై కూడా కనిపించవచ్చు.

ఈ మచ్చలు చర్మం లో ఎరుపు లేదా గోధుమ రంగు గుండ్రని మచ్చలుగా, గీతలుగా కనిపిస్తాయి.ముఖ్యంగా ఇవి మధుమేహం ఉన్న వారిలో సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి.ఈ మచ్చలు కాళ్ల ముందు భాగంలో కూడా కనిపిస్తాయి.ఈ మచ్చలను వయస్సు పెరిగే కొద్దీ వచ్చే మచ్చలు అని కూడా అనుకుంటారు.కానీ ఈ మచ్చల వల్ల బాధగానీ, దురద కానీ ఉండదు.ఈ మచ్చలు కారణంగా ఏదైనా సమస్యలను ఎదుర్కొంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే డ్రై చర్మం, దురద ఇబ్బంది పెట్టే సమస్య.అయితే ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలైనా తేలికగా తీసుకోకూడదు.

అలాగే పొడి చర్మం, దురద అనేక కారణాలు కావచ్చు.డయాబెటిస్( Diabetes ) ఉన్నప్పుడు ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడం తర్వాత వీలైనంత వరకు తేలికపాటి సబ్బును ఉపయోగించి స్నానం చేసిన తర్వాత మంచి నాణ్యమైన బాడీ లోషన్ ( Body lotion )ఉపయోగించడం మంచిది.దీని తో పాటు వ్యాయామం కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.
ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.







