ఆర్ ఎక్స్ 100 సినిమా ( RX 100 movie ) ప్రతీ ఒక్కరు చూసే ఉంటారు.మరి అలాంటి సినిమాతో అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం అందుకున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి.
ఈ డైరెక్టర్ అప్పటి నుండి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమాతో బోల్డ్ లవ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసాడు.
అయితే ఈ సినిమా విజయం తర్వాత ఈ డైరెక్టర్ కు మరో హిట్ పడలేదు.

మహాసముద్రం అంటూ మరో సినిమాతో రాగా ఇది ప్లాప్ అయ్యింది.అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో కాస్త ఢీలా పడ్డాడు.కానీ తన ప్రయత్నం ఆపకుండా మరోసారి ప్రేక్షకుల ముందుకు ”మంగళవారం”( Mangalavaaram ) సినిమాతో రాబోతున్నాడు.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.సౌత్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయనున్న ఈ సినిమా నవంబర్ 17న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
దీంతో ఈ సినిమాపై చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.ముందు నుండి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా రిలీజ్ కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.

దీంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు.తాజాగా ఈ సినిమా బడ్జెట్ గురించి డైరెక్టర్ అజయ్ క్లారిటీ ఇచ్చేసారు.ఈ సినిమాకు దాదాపు 20 కోట్ల బడ్జెట్ ను పెట్టినట్టు తెలిపారు.ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ లేదు కాబట్టి ఇది ఎక్కువ బడ్జెట్ అనే చెప్పాలి.
మరి ఇంత బడ్జెట్ ను అజయ్ భూపతి తన టీమ్ తో కలిసి రాబడుతారో లేదో చూడాలి.కాగా ఈ సినిమాలో పాయల్ రాజపుత్ ( Payal Rajput ) ప్రధాన పాత్రలో నటించింది.
ఆర్ఎక్స్ 100 కాంబోను రిపీట్ చేస్తున్నట్టే ఆ హిట్ ను కూడా రిపీట్ చేస్తారో లేదో చూడాలి.ఇక ఈ సినిమాకు కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్( Ajanish Loknath ) సంగీతం అందిస్తుండగా మధుర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.







