దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neil ) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సలార్( Salar ).ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఎట్టకేలకు ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.ఈ మూవీ రెండు పార్ట్ లుగా రాబోతున్న విషయం తెలిసిందే.
పార్ట్ వన్ త్వరలోనే విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమా వచ్చే నెల విడుదల కానున్న విషయం తెలిసిందే.కానీ చిత్ర బృందం నుంచి ప్రమోషన్స్ కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.
తాజాగా ప్రమోషన్స్ కోసం సలార్ చిత్రయూనిట్ RCB టీంని దింపింది.సలార్ నిర్మాతలు హోంబలె ఫిలిమ్స్ కన్నడ సంస్థ అని తెలిసిందే.
దీంతో ఈ సంస్థ బెంగుళూరు ఐపీఎల్ టీంతో( Bangalore IPL team ) తమ సినిమాలకు ప్రమోషన్స్ ని షురూ చేసింది.

గతంలో కేజీఎఫ్ సినిమాకి కూడా ఆర్సీబీ టీం ( RCB team )ప్రమోషన్స్ చేసింది.తాజాగా సలార్ ట్రైలర్ గురించి RCB టీం ప్రమోట్ చేస్తూ ఒక పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ లో కోహ్లీ వెనక్కి తిరిగి ఉండగా, సిరాజ్, మ్యాక్స్ వెల్ ఉండి సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న రాబోతుందని ప్రమోట్ చేస్తున్నారు.
అలాగే ప్రభాస్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.మరి ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొంటాడా లేదా అన్న సందేహాలు కూడా నెలకొంటున్నాయి.ఈ సందేహాలన్నింటికి సమాధానాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.







