యూకే : భారత సంతతి మంత్రిపై రిషి సునాక్ వేటు.. బ్రిటీష్ మీడియాలో కథనాలు

యూకే రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.భారత సంతతికి చెందిన ఆ దేశ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌ను ప్రధాని రిషి సునాక్( Rishi Sunak ) కేబినెట్ నుంచి తొలగించినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ నివేదించింది.

 Uk Pm Rishi Sunak Sacks Home Secretary Suella Braverman , Uk Pm Rishi Sunak ,-TeluguStop.com

అలాగే మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఛానెల్ పేర్కొంది.శనివారం జరిగిన మార్చ్‌పై పోలీసులు దాడి చేసిన తీరుపై సుయెల్లా విమర్శలు గుప్పించారు.

గాజా( Gaza )లో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ప్రదర్శనకారులను ద్వేషపూరిత కవాతులుగా అభివర్ణించారు బ్రేవర్‌మాన్.పాలస్తీనా అనుకూల మూక .చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా లండన్ పోలీసులు చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.పాలస్తీనా అనుకూల , వ్యతిరేక వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నప్పుడు వారిని ఎదుర్కోవడంలో పోలీసులు చూపిన చొరవను సుయెల్లా అభినందించారు.

ఈ ఘటనలో ఎంతోమంది తమ విధి నిర్వహణలో గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.సెమిటిజం, ఇతర రకాల జాత్యహంకారంతో పాటు తీవ్రవాదాం ఆ స్థాయిలో వుండటం ఆందోళనకరమని సుయెల్లా బ్రేవర్ మాన్( Suella Braverman ) హెచ్చరించారు.

Telugu Ames Cleverly, Gaza, Secretary, James Hippie, Palestine-Telugu NRI

43 ఏళ్ల సుయెల్లా బ్రేవర్‌మాన్ కేబినెట్‌లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు.అయితే మెట్ పోలీసుల గురించి ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సాయుధ దళాల మంత్రి జేమ్స్ హీప్పీ దూరంగా వున్నారు.ఒకవేళ బ్రేవర్‌మాన్‌ను రిషి సునాక్ పదవి నుంచి తొలగిస్తే విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ( James Cleverly ) హోంమంత్రిగా బాధ్యతలు చేపడతారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.మెట్ పోలీసులపై సుయెల్లా చేసిన వ్యాఖ్యలపై మొదట్లో ప్రధాని సునాక్ ఆమెకు అండగా నిలిచారు.

ప్రధానికి సుయెల్లాపై పూర్తి విశ్వాసం వుందని, ఆమె వ్యాఖ్యలను ఆయన ఆమోదించలేదని ఇటీవల 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి ప్రకటన వెలువడింది.

Telugu Ames Cleverly, Gaza, Secretary, James Hippie, Palestine-Telugu NRI

అయితే కేబినెట్ పదవి నుంచి సుయెల్లా బ్రేవర్‌మాన్ తప్పుకోవడం ఇది రెండోసారి.గతేడాది లిజ్ ట్రస్ ప్రధానిగా వున్నప్పుడు కూడా ఆమె హోం సెక్రటరీగానే పనిచేశారు.ఆ సమయంలో సుయెల్లా వ్యక్తిగత ఈమెయిల్ నుంచి అధికారిక పత్రాన్ని పంపినట్లు తేలడంతో కోడ్ ఉల్లంఘన కింద ఆమె పదవికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే లిజ్ ట్రస్ తప్పుకోవడం ఆ వెంటనే రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో సుయెల్లాను తిరిగి హోంమంత్రిగా నియమించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube