జెంటిల్ మెన్ లా కనిపించే గుప్పెడంత మనసు హీరో రిషికి ఇలాంటి చెడ్డ అలవాటు ఉందా?

తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రసారమైతే పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఇలా బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి వాటిలో గుప్పెడంత మనసు( Guppedantha Manasu ) సీరియల్ ఒకటి.

 Guppedantha Manasu Serial Hero Mukesh Gowd Bad Habbit, Guppedantha Manasu, Mukes-TeluguStop.com

ఈ సీరియల్ కి విపరీతమైనటువంటి ఫాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి మనకు తెలిసిందే.ఈ సీరియల్లో రిషి పాత్రలో నటించిన ముఖేష్ గౌడ్ ( Mukesh Gowda ) విపరీతమైనటువంటి అభిమానులను సొంతం చేసుకున్నారు.

రిషి పాత్రలో ఈయన ఎంతో అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను భారీ స్థాయిలో మెప్పించారు.

నిజానికి రిషి కన్నడ నటుడు అయినప్పటికీ ఈయనకు తెలుగులో విపరీతమైనటువంటి అభిమానులు ఉన్నారని చెప్పాలి.

ఇలా తెలుగులో ఈయనకు వస్తున్నటువంటి అభిమానం, చూసి ఏకంగా కొంతమంది దర్శక నిర్మాతలు ఈయనకి హీరోగా సినిమాలలో కూడా అవకాశాలు కల్పిస్తున్నారు.త్వరలోనే గీత శంకరం అనే సినిమా షూటింగ్ పనులలో ముఖేష్ గౌడ్ బిజీ కానున్నారు.

ప్రియాంక శర్మ ముఖేష్ గౌడ్ హీరో హీరోయిన్లుగా గీత శంకరం ( Geetha Shankaram ) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇదివరకే ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో సినిమాని ప్రకటించారు.

ఇలా తెలుగు బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన త్వరలోనే వెండితెరపై కూడా హీరోగా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ముఖేష్ గౌడ్ ఎన్నో విషయాలను వెల్లడించారు.తనకు మొదట్లో తెలుగు అసలు వచ్చేది కాదని ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నానని ఈయన తెలిపారు.తెలంగాణ ఆంధ్రలో నాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.వారి చూపించే అభిమానం ముందు నేను తెలుగు నేర్చుకోవడం పెద్ద కష్టమేమి కాదనిపించింది.

ఇలా నేను తెలుగు మాట్లాడుతూ ఉంటే తప్పులు పోతాయని చాలామంది నన్ను తిడతారు అనుకుంటున్నాను కానీ కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటున్నానని ముఖేష్ గౌడ్ తెలిపారు.ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ చిన్నప్పుడు మీరు చేసిన కొన్ని పనులు అలాగే మీకు డిఫరెంట్ గా ఏదైనా అలవాటు ఉందా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ముకేశ్ సమాధానం చెబుతూ నాకు వర్షం వస్తే ఆ మట్టి వాసన చాలా ఇష్టం.

ఇప్పటికీ ఆ మట్టి వాసన తనకు చాలా ఇష్టమని ముఖేష్ తెలిపారు.అయితే చిన్నప్పుడు నాకు తెలియక ఇది ఇంత మంచి వాసన వస్తుంది అంటే ఏదో తినేదే అనుకునేవాడిని అందుకే వర్షం వచ్చేముందు ఆ మట్టిని తాను తినేవాడిని అంటూ తనకు ఉన్నటువంటి ఈ అలవాటు గురించి ముఖేష్ బయటపెట్టారు.

అయితే ఈయన మాత్రమే కాకుండా చాలామందికి వర్షం వచ్చేముందు వచ్చే ఆ మట్టి వాసనని ఇష్టపడతారని చెప్పాలి.

https://www.facebook.com/watch/?v=1600409630374503
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube