దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి పెరిగింది.ఓ వైపు కాలుష్యం పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతూనే మరోవైపు దీపావళి పండుగను జరుపుకున్నారు.
దీపావళి పండుగపై నిషేధాజ్ఞలు విధించినా పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఢిల్లీ వాసులు.పక్క రాష్ట్రాల నుంచి టపాసులు కొనుక్కొచ్చి మరీ పండుగను జరుపుకున్నారు.
దీంతో అర్ధరాత్రి వరకు టపాసులమోతతో ఢిల్లీ దద్దరిల్లింది.ఈ క్రమంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 286 పాయింట్లుగా నమోదు అయింది.
ఓ వైపు కాలుష్య కట్టడికి ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా ప్రజలు నిర్లక్ష్య ధోరణి అవలంభించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.