ప్రస్తుతం సమాజంలో ప్రమాదవశాత్తు జరుగుతున్న మరణాలను విచారణ చేస్తే అధిక శాతం హత్యలుగా బయటపడుతున్నాయి.ఇందులో కూడా ఎక్కువగా వివాహేతర సంబంధాల కారణంగానే జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే వివాహేతర సంబంధానికి( Illegal Affair ) అడ్డుగా ఉన్న భర్తను తన ప్రియుడితో కలిసి భార్య హతమార్చిన ఘటన మహమ్మదాబాద్ లో( Mahammadabad ) శుక్రవారం వెలుగులోకి వచ్చింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.మహమ్మదాబాద్ లోని కొనగట్టుపల్లిలో ఇప్పలి అంజలయ్య(45), ఇప్పలి లక్ష్మమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం.లక్ష్మమ్మ( Lakshmamma ) పాలమూరుకు అడ్డా కూలీగా వెళ్లేది.
లక్ష్మమ్మకు నవాబ్ పేట మండలం మరికల్ కు చెందిన జోగు శ్రీను( Jogu Srinu ) పరిచయం అయ్యాడు.వీరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
రెండేళ్లుగా సాగుతున్న వీరి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చాలని లక్ష్మమ్మ నిర్ణయించుకుంది.

ప్లాన్ లో భాగంగా బయటకు వెళ్లిన అంజలయ్యను( Anjalaiah ) జోగు శ్రీను, అతని హెల్పర్ బాలయ్య అనుసరించి మహమ్మదాబాద్ శివారులోని ధర్మపురి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశారు.హత్య అనంతరం ఇప్పలి అంజలయ్య ఐదు రోజుల క్రిందట అదృశ్యం అయినట్లు అతని భార్య ఇప్పలి లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదృశ్యమైన అంజలయ్య ఆచూకీ కోసం చుట్టుపక్కల ఉండే అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపించారు.

మహమ్మదాబాద్ శివారులోని ధర్మాపూర్ అటవీ ప్రాంతంలో( Dharmapur Forest Area ) ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా అది ఇప్పలి అంజలయ్య గా గుర్తించారు.ఆ తరువాత మృతుడి భార్య ఇప్పలి లక్ష్మమ్మపై పోలీసులకు అనుమానం రావడంతో, అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో ప్రియుడు, మరో వ్యక్తి సహకారంతో తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది.








