కామారెడ్డి ప్రజలు ఇవ్వనున్న తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.కేసీఆర్ పాలనకు చరమగీతం పాడటానికి కామారెడ్డి సిద్ధమైందని తెలిపారు.
తెలంగాణ భవిష్యత్ ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్నేళ్ల పాలనలో రైతులను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు.
పదేళ్ల తరువాత కేసీఆర్ కు కామారెడ్డి గుర్తుకు వచ్చిందన్న ఆయన ఓట్ల కోసం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే గజ్వేల్ కు కేసీఆర్ చేసింది ఏంటని ప్రశ్నించారు.
గజ్వేల్ ను పట్టించుకోలేదు కాబట్టే ఓటమి భయంతో కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.తన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నందుకు గంప గోవర్ధన్ కేసీఆర్ ను తిట్టుకుంటున్నారని చెప్పారు.
కామారెడ్డి ఎన్నిక కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు.బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







