అక్రమ వలసదారులను, విదేశీ పౌరులను బహిష్కరించేందుకు జరుగుతున్న ప్రచారంలో భాగంగా పాకిస్థాన్( Pakistan ) గురువారం 80 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసింది.దాదాపు మూడేళ్లపాటు జైలులో ఉన్న మత్స్యకారులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళుతూ పాకిస్థాన్‌లోకి ప్రవేశించారని పాక్ అధికారులు అరెస్టు చేశారు.
శుక్రవారం గుజరాత్‌లోని( Gujarat ) వివిధ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దుకు తీసుకొచ్చి, వారిని భారత అధికారులకు పాక్ అధికారులు అప్పగించారు.గుజరాత్ ప్రభుత్వం నుంచి ఒక బృందం వారిని రిసీవ్ చేసుకోవడానికి, రైలులో స్వస్థలానికి తీసుకురావడానికి పంజాబ్ చేరుకుందని గుజరాత్ ఫిషరీస్ కమిషనర్ నితిన్ సంగ్వాన్( Nitin Sangwan ) తెలిపారు.

మత్స్యకారులు 2020లో వేర్వేరు సమయాల్లో గుజరాత్ తీరాన్ని విడిచిపెట్టారు.పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ కంట పడటంతో వారిని అతను పట్టుకున్నారు.ఆపై కరాచీలోని మాలిర్ జైలుకు ( Malir Jail, Karachi )తరలించారు, అక్కడ వారు కఠినమైన పరిస్థితులు, వైద్య సదుపాయాల కొరతను ఎదుర్కొన్నారు.భారత్-పాకిస్థాన్ పీపుల్స్ ఫోరమ్ ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యుడు జీవన్ జుంగి మాట్లాడుతూ.
ఇప్పటికీ 173 మంది భారతీయ మత్స్యకారులు పాక్ జైళ్లలో మగ్గుతున్నారని అన్నారు.

అయితే ముగ్గురు మత్స్యకారులు మాత్రం ఎట్టకేలకు తమ కుటుంబాలను కలిశారు.ఫ్యామిలీతో మళ్ళీ కలిసినందుకు మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.కొన్ని ప్రాంతాలలో స్పష్టంగా సముద్ర సరిహద్దును గుర్తించే సంకేతాలు లేనందున ఇరుదేశాల మత్స్యకారులు పొరపాట్లు చేస్తూ అరెస్టు అవుతున్నారు.
ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం చూపేంత వరకు ఫిషర్ మెన్ కు ప్రమాదాలు తప్పవు.







