ఎంతోమంది ఉద్యమ నాయకులు పోరాడి కొట్లాడి ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణ (Telangana) ని మళ్లీ కొన్ని ఆంధ్ర శక్తులు తమ చేతుల్లోకి తీసుకోవాలని శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే కొంతమంది ఆంధ్ర శక్తులను తెలంగాణ ప్రజలు పసిగట్టారు.
అంతే కాదు రాజకీయ విశ్లేషకులు సైతం వారిపై అనుమాన పడుతున్నారు.వైయస్ రాజశేఖర్ ముద్దుబిడ్డ షర్మిల (Sharmila) రాష్ట్రాన్ని అది చేస్తా ఇది చేస్తా కేసీఆర్ ని గద్దెదించుతా అని ఎన్నో మాటలు మాట్లాడి చివరికి కాంగ్రెస్లో విలీనం చేయాలనుకుంది.
కానీ అది కుదరకపోవడంతో ఈ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకొని పూర్తి మద్దతు కాంగ్రెస్ కే ఇచ్చింది.
అలాగే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని ప్రకటించిన చంద్రబాబు (Chandrababu) కూడా ఈ మధ్య నే ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ పోటీ చేయదని స్పష్టం చేసింది.
ఇక వారి మద్దతు కూడా కాంగ్రెస్ కే( Congress Party ) అని తెలిపింది.అయితే కాంగ్రెస్ ముసుగులో ఈ ఆంధ్ర శక్తులన్నీ మళ్లీ తెలంగాణను తమ గుప్పిట్లో చేర్చుకోవాలని చూస్తున్నారని ఇప్పటికే చాలా పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.
అయినప్పటికీ కాంగ్రెస్ ని తమ ఆయుధంగా చేసుకొని ఎలాగైనా మళ్లీ తెలంగాణను అణచివేయాలని చూస్తున్నారు.

ఇక గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మళ్లీ ఆంధ్ర పాలకుల చేతుల్లోకి తీసుకురావాలి అనుకున్నప్పటికీ అది కుదరలేదు.ఇక ఈసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచి తమ ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని సీఎంగా గెలిపించి సీఎం పీఠంపై కూర్చోబెడితే పూర్తి అధికారాలు తమ చేతుల్లోనే ఉంటాయని ఆంధ్ర నాయకులు భావిస్తున్నారట.అందుకే తెలంగాణలో పోటీ ఉంటుంది అని చెప్పిన చాలామంది ఆంధ్ర నాయకులు ఎన్నికల సమయం దగ్గర పడే టైంకి పోటీ చేయడం లేదు పూర్తిగా కాంగ్రెస్ కే మద్దతు అని ప్రకటించారు.

ఇక ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్ ముసుగు వేసుకొని షర్మిల అయినా చంద్రబాబు నాయుడు అయినా సరే ఇలా మళ్లీ తమ ఆధిపత్యాన్ని చూపించాలని భావిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రజలు నమ్మరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అంతేకాదు పదేపదే కేసీఆర్ (KCR) కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ ఆంధ్ర చేతుల్లోకి వెళ్తుంది అని ప్రసంగాల్లో చెప్పుకొస్తున్నారు.మరి చూడాలి తెలంగాణ ప్రజలు ఏ పార్టీ వైపు ఉంటారో
.






