ప్రస్తుత సమాజంలో మానవత్వానికి విలువలేదు అనడానికి ఈ సంఘటన నిదర్శనం.మనిషి ఆస్తుపాస్తులకు ఇచ్చే విలువలో సగం విలువ కూడా కుటుంబ బంధాలకు, మానవత్వానికి ఇవ్వడం లేదు అనడానికి కూడా ఈ సంఘటనే నిదర్శనం.
ఓ కొడుకు బతికుండగానే తన తల్లిని స్మశానంలో( Cemetery ) వదిలేసి వెళ్లిపోయాడు.ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం లో( Dachepalli Mandal ) చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి చెందిన ఏడుకొండలు, వెంకటరత్నమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం.

అయితే ఈ దంపతులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషించుకుంటే.వృద్ధాప్యంలో ఉన్న కన్న తల్లిని కుమారుడు మిర్యాలగూడ మండలంలోని ఓ తండాలో ఉన్న స్మశాన వాటిక వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు.గ్రామపంచాయతీ వర్కర్ శ్రీనివాస్ మొక్కలకు నీళ్లు పెట్టడం కోసం స్మశాన వాటికకు వెళితే అక్కడ గాయాలతో కొనఊపిరిలో ఉన్న వెంకటరత్నమ్మ( Venkataratnamma ) కనిపించింది.
వెంటనే శ్రీనివాస్( Srinivas ) గ్రామ సర్పంచ్ కు సమాచారం అందించాడు.గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించాడు.పోలీసులు వృద్ధురాలిని ఏం జరిగిందని ఆరా తీయగా.

ఆస్తి పంపకం( Property Disputes ) విషయంలో గొడవలు తలెత్తడం వల్ల తన కొడుకు, కోడలు తనపై దాడి చేశారని తెలిపింది.ఇంటికి వెళితే తనను తన కొడుకు, కోడలు చంపేస్తారని తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంది.గాయాలతో ఉన్న వెంకటరత్నమ్మను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.దాచేపల్లి పోలీసులకు సమాచారం అందించారు.
ఈ విషయం బయటకు తెలియడంతో ఇలాంటి వ్యక్తులపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకొని కఠినంగా శిక్షిస్తేనే సమాజంలో కాస్త మార్పు వస్తుందని.లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న వారంతా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







