డీప్ ఫేక్ లకు సంబంధించి ఫేస్ బుక్ లో కొత్త నిభందనలు అమలు చేయనున్న మెటా..!

మెటా సంస్థ డీప్ ఫేక్ లకు సంబంధించి ఫేస్ బుక్ లో కొత్త నియమ నిబంధనలు జనవరి 1 నుంచి అమలు చేయనుంది.డీప్ ఫేక్ వీడియోలు, ఎడిట్ చేసిన వీడియోలు, చిత్రాలకు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలు అమలు పరచాలని నిర్ణయం తీసుకుంది.

రాజకీయ ప్రకటనలలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ నుండి తయారైన ప్రచార సామాగ్రిని ఫేస్ బుక్ లో ఉపయోగించడాన్ని మెటా నిషేధించింది.ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందకుండా ఆపడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

కంటెంట్ ద్వారా వ్యాప్తి చెందుతున్న అబద్దాలను ఆపడం చాలా కష్టం.కాబట్టి రాజకీయ పార్టీలు ప్రకటన దారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్( Artificial Intelligence ) ఆధారిత ప్రకటనల కంటెంట్లను ఉపయోగించకుండా నిషేధించడం జరిగింది.

Telugu Meta-Technology Telugu

ప్రస్తుతం మెటా సంస్థ తన వెబ్సైట్లోని సహాయ కేంద్రం విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రజ్ఞల కంటెంట్ కంటే కంపెనీ వాస్తవ తనిఖీ భాగస్వాములచే తిరస్కరించబడిన ప్రకటనలను నిరోధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

Telugu Meta-Technology Telugu

ఆరోగ్యం, ఆర్థిక సేవలు, రాజకీయాలు, ఉపాధి, సామాజిక సమస్యలు, క్రెడిట్, ఎన్నికలు లాంటి విభాగాలకు సంబంధించిన ప్రకటన దారులకు మెటా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అడ్వర్టైజింగ్ టూల్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం లేదు.2024 లో జరగబోయే ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు సాంకేతికను ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉండాలని యూకే( UK ) లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రత శిఖరాగ్ర సమావేశానికి ముందు ప్రభుత్వాలు, టెక్ కంపెనీలను మెటా టాప్ పాలసీ ఆఫీసర్ నిక్ క్లెగ్ హెచ్చరించారు.తప్పుదారి పట్టించే వీడియోలను, వ్యంగ్యంగా ఉండే వీడియోలను, పేరడీ వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా రూపొందించి ఫేస్బుక్లో అప్లోడ్ చేయడానికి మెటా నిషేధించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube