రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ నెలకొంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ర్యాలీలు ఒకేసారి నిర్వహించడంతో ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది.దీంతో రెండు పార్టీల శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
ఘర్షణ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.కాగా ఈ పలువురు కార్యకర్తలకు తీవ్రగాయాలు అయ్యాయి.
మల్ రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఈ వివాదం చెలరేగిందని సమాచారం.







