బిగ్ బాస్ హౌస్( Bigg Boss show ) నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఆట సందీప్( Aata Sandeep ) వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు షాకింగ్ విషయాలను వెల్లడించారు.తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను సైతం ఆట సందీప్ పంచుకున్నారు.
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ లో యాక్టర్, డైరెక్టర్ కూడా ఉంటాడని ఆయన అన్నారు.డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్ డైరెక్టర్ తో సంబంధం లేకుండా చేయగలమని ఆట సందీప్ తెలిపారు.
![Telugu Aata Sandeep, Bigg Boss, Bigg Boss Show, Dance Shows, Jyothi, Ocial, Toll Telugu Aata Sandeep, Bigg Boss, Bigg Boss Show, Dance Shows, Jyothi, Ocial, Toll](https://telugustop.com/wp-content/uploads/2023/11/Aata-Sandeep-tollywood-viral-bigg-boss-bigg-boss-7-ocial-media-Jyothi.jpg)
ప్రస్తుత జనరేషన్ లో ఇది మాత్రమే చేస్తానని లిమిట్స్ పెట్టుకుంటే కష్టమని ఆయన పేర్కొన్నారు.మూడు సినిమాలకు అవకాశాలు వచ్చాయని ఆ మూడు సినిమాలను పూర్తి చేశానని ఆట సందీప్ వెల్లడించారు.తెలుగుతో పాటు కన్నడ సినిమాలకు కూడా పని చేస్తున్నానని ఆట సందీప్ అన్నారు.కొరియోగ్రాఫర్స్ లో జోడీ అంటే నేను జ్యోతి( Jyothi ) మాత్రమేనని ఆట సందీప్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
మా జోడీని జనాలు లైక్ చేస్తారని ఆయన పేర్కొన్నారు.జ్యోతి నా కంటెస్టెంట్ అని నర్తనశాల అనే షో సమయంలో ఇష్టం ఏర్పడి పెళ్లి చేసుకుంటానని ఆట సందీప్ అన్నారు.
తను కూడా వెంటనే ఓకే చెప్పిందని ఆట సందీప్ పేర్కొన్నారు. మాకు ఒక బాబు అని పిల్లలు వద్దనుకోవాలని అనుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.కష్టపడి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ప్రయత్నిస్తున్నామని ఆట సందీప్ వెల్లడించారు.
![Telugu Aata Sandeep, Bigg Boss, Bigg Boss Show, Dance Shows, Jyothi, Ocial, Toll Telugu Aata Sandeep, Bigg Boss, Bigg Boss Show, Dance Shows, Jyothi, Ocial, Toll](https://telugustop.com/wp-content/uploads/2023/11/Aata-Sandeep-dance-shows-tollywood-viral-bigg-boss-bigg-boss-7.jpg)
షోలు, సినిమాలలో ఆఫర్లు వస్తున్నామని భవిష్యత్తులో మరో కిడ్ విషయంలో ప్లాన్ చేసుకుంటామని ఆయన అన్నారు.ఆట సందీప్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆట సందీప్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఆట సందీప్ ను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.