ఫస్ట్ సింగిల్ తో గుంటూరు కారంపై అంచనాలు పెరిగాయిగా.. 2024 మహేష్ సొంతమంటూ?

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా( Guntur Karam )పై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ధూమ్ మసాలా సాంగ్ తాజాగా విడుదలైంది.ఈ ఫస్ట్ సింగిల్ తో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

 Gunturu Karam Movie First Single Increased Expectations Details Here Goes Viral-TeluguStop.com

మహేష్ త్రివిక్రమ్( Mahesh Babu Trivikram ) ఈ సినిమాతో కచ్చితంగా మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.రామజోగయ్యశాస్త్రి సాహిత్యం ఈ ఫస్ట్ సింగిల్ కు హైలెట్ గా నిలిచింది.2024 సంవత్సరం మహేష్ బాబు సొంతమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నాయి.ఈ సినిమా సాహిత్యం విషయంలో త్రివిక్రమ్ కూడా తన వంతు సహాయసహకారాలు అందించారని సమాచారం అందుతోంది.

Telugu Dum Masala, Guntur Karam, Mahesh Babu, Trivikram-Movie

గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్( Guntur Karam First Single Release ) తో మహేష్ బాబు అభిమానులు ఆశలు ఫలించాయనే చెప్పాలి.ఈ పాటకు స్పైస్ ర్యాప్ అని పేరు పెట్టుకోగా హేమచంద్ర, విక్కీ సంయుక్తంగా ఈ పాటను ఆలపించడం గమనార్హం.త్రివిక్రమ్ భావుకత ఈ సాంగ్ కు హైలెట్ గా నిలిచింది.గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ మొదలుకావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.జనవరి నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.ఆరోజు రికార్డులు బ్రేక్ కావడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Dum Masala, Guntur Karam, Mahesh Babu, Trivikram-Movie

మరోవైపు గుంటూరు కారం మూవీ రిలీజ్ డేట్ గురించి కూడా ఒకింత కన్ఫ్యూజన్ నెలకొనగా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.గుంటూరు కారం మూవీ థియేటర్లలో విడుదలైన తర్వాత సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ( Guntur Karam Budget ) మొత్తం బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube